Love Love : అమ్మాయి కోసం..పాక్ కు వెళ్లేందుకు ట్రై..సీన్ కట్ చేస్తే

  • Published By: madhu ,Published On : July 18, 2020 / 07:30 AM IST
Love Love : అమ్మాయి కోసం..పాక్ కు వెళ్లేందుకు ట్రై..సీన్ కట్ చేస్తే

ప్రేమకు హద్దులు ఉండవు..ఎల్లలు దాటుతుంది. ఇలాగే. ఓ యువకుడు..Online లో పరిచయం అయిన అమ్మాయిని కలుసుకొనేందుకు ఏకంగా సరిహద్దులు దాటాలని ప్రయత్నించాడు. ఏ దేశమో అనుకుంటున్నారా..అదే..పాకిస్తాన్. బైక్ పై వెళ్లాడు. సీన్ కట్ చేస్తే..బోర్డర్స్ లో భద్రతను పర్యవేక్షిస్తున్న వారు పట్టుకుని…సొంత గ్రామానికి తరలించారు.

ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడిని సరిహద్దు భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. అదుపులోకి తీసుకున్నాక విచారించారు. అనంతరం ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.

ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు : – 
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ కు చెందిన జషాన్ మొహ్మద్ సిద్ధిఖీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. ఈ క్రమంలో…పాక్ దేశానికి చెందిన అమ్మాయితో Online లో పరిచయం అయ్యింది. అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలని అనుకున్నాడు.

బైక్ తీసుకుని : – 
దీంతో తన దగ్గరనున్న బైక్ తీసుకుని 2020, జులై 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తమ కొడుకు కనిపించకపోవడంతో Osmanabad city police station లో ఫిర్యాదు చేశారు. సిద్ధిఖీ సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించామని, అందులో పాక్ దేశానికి చెందిన అమ్మాయిను ప్రేమిస్తున్నట్లు తేలిందని స్టేషన్ సూపరిటెండెంట్ పోలీస్ రాజ్ తక్ రోషన్ వెల్లడించారు. తర్వాత..అతని ఫోన్ కాల్స్ ను రికార్డు, ట్రేస్ చేశామని, కచ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు.

పాక్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం : – 
వెంటనే ఈ సమాచారాన్ని BSF Official వారికి అందించామన్నారు. అప్రమత్తమైన వారు 2020, జులై 16వ తేదీన పాక్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సిద్ధిఖీని బీఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఉస్మానాబాద్ పోలీసులు అక్కడకు వెళ్లి కస్టడీకి తీసుకున్నట్లు వెల్లడించారు. కరాచీ ప్రాంతంలో ఉండే..ఓ అమ్మాయిని ప్రేమించాడని, సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యిందని పోలీసులు తెలిపారు.

ఎలా వెళ్లాడు ?
ధోలవీర గ్రామ సమీపం గుండా వెళుతుండగా.. బైక్ ఇసుకలో కూరుకపోయింది. చేసేది ఏమ లేక..బైక్ ను అక్కడే వదిలేసి కాళ్లకు పనిచెప్పాడు. అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న BSF జవాన్లు బైక్ ను గుర్తించారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండడంతో అప్రమత్తమయ్యారు. బైక్ పై ఎవరు వచ్చారు ? ఎక్కడకు వెళ్లారు ? అనే దానిపై ఆరా తీయడం మొదలు పెట్టారు.

అప్పటికే ఉస్మానాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం వచ్చింది. పాక్ సరిహద్దు వైపు వెళుతున్న సిద్ధిఖీని బీఎస్ఎఫ్ అడ్డుకున్నారు. బైక్ అతడిదని తేలింది. అనంతరం అధికారులకు సమాచారం ఇచ్చి…పోలీసుల ద్వారా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.