Supreme Court : విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం

విడాకులు కోరుకునే దంపతులను ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయాల్సిన అవసరం లేదని దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది.

Supreme Court : విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం

Supreme Court (3)

Supreme Court : విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. విడాకులు కోరుకునే దంపతులు 6 నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కలిసి జీవించలేనప్పుడు ఆర్టికల్ 142 ప్రకారం తన అధికారాలను ఉపయోగించుకుని దంపతులు విడాకులు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దంపతులు ఇద్దరూ విడాకులకు అంగీకరిస్తే హిందూ వివాహ చట్టం ప్రకారం 6 నెలలపాటు ఆగాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ప్రాథమిక హక్కులతో సంబంధం ఉన్న ఆర్టికల్ 142ను పరిగణనలోకి తీసుకుని, కోర్టు తన అధికారాలతో న్యాయం చేస్తుందని సుప్రీంకోర్టు బెంచ్ వెల్లడించింది. కాగా, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బీ ప్రకారం.. విడాకులు కావాలనుకునే దంపతులు కచ్చితంగా 6 నెలలు వేచి ఉండాల్సి వస్తోంది.

Kerala High Court Key Judgment : భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకోవ‌చ్చు.. కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్పు

అయితే, విడాకులు కోరుకునే దంపతులను ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయాల్సిన అవసరం లేదని దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది. అయితే, సంపూర్ణ న్యాయం చేసేందుకు తాము ఆ అధికారాలు వినియోగించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే, ఆర్టికల్ 142 ప్రకారం వైవాహిక బంధాన్ని రద్దు చేసేందుకు సుప్రీంకోర్టుకు అధికారం ఉందా? లేదా? అన్న ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలో ఓ కేసును 2016, జూన్ 29వ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ శివకీర్తి సింగ్, ఆర్ భానుమతిలతో కూడిన బెంచ్ ఆ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేసింది.

Karnataka : విడాకులు కోరిన భార్యను విచక్షణా రహితంగా కత్తితో పొడిచిన భర్త

ఆ కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనం.. 2022, సెప్టెంబర్ 29వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ అడ్వకేట్లు ఇందిరా జైసింగ్, వి.గిరి, కపిల్ సిబల్, దుశ్యంత్ దావే, మీనాక్షీ ఆరోరాలను న్యాయ సలహాదారులుగా నియమించారు. సీనియర్ అడ్వకేట్లు వి.మోహన, జయ సాల్వే, అడ్వకేట్ అమోల్ చితలే కూడా ఈ కేసులో వాదనలు వినిపించారు.