RK Roja : చంద్రబాబుకి దమ్ముంటే ఆయనతో అక్కడ సెల్ఫీ దిగాలి- మంత్రి రోజా సవాల్

RK Roja : ఎన్టీఆర్ పార్టీని లాక్కుని, ఆయన చావుకి కారణమై, ఈ రోజు ఆయనకు శతజయంతి ఉత్సవాలు చేస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు.

RK Roja : చంద్రబాబుకి దమ్ముంటే ఆయనతో అక్కడ సెల్ఫీ దిగాలి- మంత్రి రోజా సవాల్

Rk Roja (Photo : Google)

RK Roja : ఈ నెల 22న సీఎం జగన్ మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలకు వైసీపీ అధినేత జగన్ శంకుస్థాపనలు చేయబోతున్నారని మంత్రి రోజా తెలిపారు. ఎన్నికల ముందు హడావిడి చేయడం చంద్రబాబుకు అలవాటే అని విమర్శించారు రోజా. చంద్రబాబుకి దమ్ముంటే కొడాలి నానితో సెల్ఫీ దిగే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు.

” కృష్ణా జిలాలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెలలో పర్యటిస్తారు. 19న గుడివాడలో 8వేల 912 టిడ్కో ఇళ్లను సీఎం జగన్ లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. 22న మచిలీపట్నంలో పోర్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇస్తారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు శంకుస్థాపనలు చేయడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేదు. చంద్రబాబు ఎక్కడో సెల్ఫీ దిగడం కాదు. గుడివాడలో టిడ్కో ఇళ్ల దగ్గర కొడాలి నానితో సెల్ఫీ దిగే దమ్ముందా?” అని రోజా సవాల్ విసిరారు.

Also Read..Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు

” కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాకు సీఎం జగన్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. గుడివాడలో దాదాపుగా 9వేల టిడ్కో ఇళ్లను ఓపెన్ చేయబోతున్నారు. జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న మచిలీపట్నం పోర్టు పనులను ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు హడావిడిగా భూమి పూజలు చేశారే కానీ, ఎక్కడైనా వాటిని పూర్తి చేసి ప్రజలకు అందించింది లేదు.

కనీసం ఎన్టీఆర్ కోసం ఆ జిల్లాలో చంద్రబాబు ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ, ఎన్టీఆర్ పార్టీని లాక్కుని, ఆయన చావుకి కారణమై, ఈ రోజు ఆయనకు శతజయంతి ఉత్సవాలు చేస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు ఎక్కడో సెల్ఫీ తీసుకోవడం కాదు. ఆయనకు దమ్ముంటే, గుడివాడకు వచ్చి టిడ్కో ఇళ్ల ముందు మా కొడాలి నాని అన్నతో సెల్ఫీ తీసుకునే ధైర్యం ఉందా?” అని చంద్రబాబుకి చాలెంజ్ విసిరారు మంత్రి రోజా.

Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్