Katasani Rambhupal Reddy : కొండారెడ్డి బురుజా? నీ టెంటా? దమ్ము, ధైర్యముంటే రా.. నారా లోకేశ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్

Katasani Rambhupal Reddy : చర్చ టైమ్, డేట్ నీవే చెప్పు. లేదా మా ఇంటికి రా. లేదంటే నేనే నీ శిబిరానికి వస్తా. లోకేశ్ జోకర్‌కు ఎక్కువ బఫూన్ కి తక్కువ.

Katasani Rambhupal Reddy : కొండారెడ్డి బురుజా? నీ టెంటా? దమ్ము, ధైర్యముంటే రా.. నారా లోకేశ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్

Katasani Rambhupal Reddy

Katasani Rambhupal Reddy : ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిత్యం ప్రజల్లోకి వెళ్తూ వారితో టచ్ లో ఉంటున్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్ర వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ రగడకు దారితీసింది. ఆరోపణలు, విమర్శలు, సవాళ్లతో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నారా లోకేశ్ పై విరుచుకుపడ్డారు.

లోకేశ్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు కాటసాని చెప్పారు. నారా లోకేశ్ కర్నూలు పాదయాత్ర దాటేలోపు అవినీతిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని నారా లోకేశ్ కి ప్రతి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాటసాని. నారా లోకేశ్ కి దమ్ము ధైర్యం ఉంటే నేను విసిరిన సవాల్ ను స్వీకరించి చర్చకు రావాలన్నారు. తాగుబోతులు రాసిచ్చిన స్ర్కిప్టు చదవడం కాదు, తెలుసుకుని మాట్లాడితే మంచిదని లోకేశ్ కు హితవు పలికారు ఎమ్మెల్యే కాటసాని.

Also Read..Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు

” కొండారెడ్డి బురుజా? లేక నీ టెంటు దగ్గరా? లేక మా ఇంటి దగ్గరా? ఎక్కడైనా చర్చకు నేను రెడీ. నేను అవినీతి చేసినట్లు లోకేశ్ నిరూపిస్తే రాజకీయాలు నుండి శాశ్వతంగా వైదొలుగుతా. నీవు నిరూపించకపోతే నీవు, నీ తండ్రి రాజకీయాలు నుండి శాశ్వతంగా వైదొలుగుతారా? నా రాజకీయ అనుభవం అంత వయస్సు లేని నారా లోకేశ్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది.

Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

లోకేశ్ ను బఫూన్ గా చూస్తున్నా. రాజకీయ నాయకుడిగా చూడటం లేదు. ఎవరో రాసిచ్చిన పేపర్ చదివే స్టేజీలో ఉంటే.. రాజకీయ నాయకుడో కాదో చూసుకోవాలి. లోకేశ్.. చర్చ టైమ్, డేట్ నీవే చెప్పు. లేదా మా ఇంటికి రా. లేదంటే నేనే నీ శిబిరానికి వస్తా. లోకేశ్ జోకర్‌కు ఎక్కువ బఫూన్ కి తక్కువ. 2014 నుండి 2019 వరకు ఏం చేశారో చెప్పాలి” అని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.