Woman Attack : లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. యువకుడిపై యువతి దాడి
కృష్ణా జిల్లాలో లైంగికంగా వేధిస్తున్నాడని యువకుడిపై ఓ యువతి తీవ్రంగా దాడి చేసింది. మచిలీపట్నంలో కృష్ణ అనే వ్యక్తిపై స్వప్న అనే మహిళ దాడికి పాల్పడింది

Woman Attack
A young woman attacks a young man : కృష్ణా జిల్లాలో లైంగికంగా వేధిస్తున్నాడని యువకుడిపై ఓ యువతి తీవ్రంగా దాడి చేసింది. మచిలీపట్నంలో కృష్ణ అనే వ్యక్తిపై స్వప్న అనే మహిళ దాడికి పాల్పడింది.
రక్తం వచ్చేలా కొట్టింది. ఫోన్ చేసి తనను లైంగికంగా వేధిస్తున్నాడని..అందుకే దాడి చేశానని స్వప్న చెబుతోంది. కాగా, తన దగ్గర డబ్బులు తీసుకుందని కృష్ణ ఆరోపిస్తున్నాడు. స్వప్న రక్తం కారేలా తలపగలగొట్టింది.
కృష్ణకు తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.