Suicide Attempt : భూ వివాదంతో మరోసారి అక్బర్‌ బాషా ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

కడప జిల్లాలో అక్బర్‌ బాషా భూ వివాదం మరో టర్న్‌ తీసుకుంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో అక్బర్‌ ఫ్యామిలీ మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్బర్‌ బాషా ఫ్యామిలీ పరుగుల మందు తాగింది.

Suicide Attempt : భూ వివాదంతో మరోసారి అక్బర్‌ బాషా ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

Basha

Updated On : September 21, 2021 / 9:55 AM IST

family suicide attempt : కడప జిల్లాలో అక్బర్‌ బాషా భూ వివాదం మరో టర్న్‌ తీసుకుంది. పదిరోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో అక్బర్‌ ఫ్యామిలీ మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు పిల్లలతో సహా అక్బర్‌ బాషా దంపతులు పురుగుల మందు తాగారు. దీంతో వారిని కర్నూలు జిల్లాలోని చాలగమర్రి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో… వారిని ప్రొద్దుటూరుకు తరలించారు. అక్బర్‌ బాషా ఫ్యామిలీ మోనోక్రోటోపాస్‌ పరుగుల మందు తాగింది. వారికి వెంటిలేటర్‌ సహాయం కూడా అవసరముందని వైద్యులు తెలపడంతో ప్రొద్దుటూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈనెల 11న తనకు మైదుకూరు సీఐ న్యాయం చేయడం లేదని, భూవివాదంపై తమను ఇబ్బందిపెడుతున్నారంటూ అక్బర్‌ బాషా ఫ్యామిలీ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. 48 గంటల్లో తమ సమస్యను పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆ వీడియోలో తెలిపింది.ఈ విషయం సీఎం జగన్‌ కార్యలయానికి చేరడంతో.. ఆయన… కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో అక్బర్‌ ల్యాండ్‌ సమస్యకు పరిష్కారం లభించిందని అంతా అనుకున్నారు. కానీ మరోసారి అక్బర్‌ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్టు అయ్యింది.

Killer Gang : కిల్లర్‌ గ్యాంగ్‌ అరెస్టు..విచారణలో విస్తుపోయే నిజాలు

అక్బర్‌ బాషాకు అతడి అత్త కాశీంబి తనపేర దువ్వూరులో ఉన్న ఎకరంనర భూమిని ఇస్తూ వీలునామా రాయించింది. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ… వీలునామాను రద్దు చేసుకుని.. మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయించింది. దీనిపై అక్బర్‌ బాషా కోర్టుకు కూడా వెళ్లాడు. 2018లోనే కడప కోర్టు అక్బర్‌ బాషా చేయించుకున్న రిజిస్ట్రేషన్‌ చెల్లదని తీర్పు ఇచ్చింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు అక్బర్‌. అయితే మైదుకూరు సీఐ తనకు న్యాయం చేయకపోగా….వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఈనెల 11న సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు.

సీఎం జగన్‌ ఆదేశాలతో అక్బర్‌ భూ వివాదంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే 2018లో అక్బర్‌ చేయించుకున్న రిజిస్ట్రేషన్‌ చెల్లదంటూ కడప కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అక్బర్‌ అత్త కాశీంబితో చర్చలకు దిగాడు. అత్త అమ్మిన భూమిని తనకు రిజిస్ట్రేషన్‌ చేయించాలంటూ రెండు రోజులపాటు చర్చలు జరిపారు.11 లక్షలు ఇచ్చేలా బేరసారాలకు ప్రయత్నించాడు. అయినా ప్రత్యర్థులు ససేమిరా అనడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్బర్‌ బాషా.. తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేశాడు.
బైట్: అక్బర్‌ బాషా, బాధితుడు

Film Industry : ఏపీలో సినిమా కష్టాలు కొలిక్కి వచ్చాయా?

మరోవైపు అక్బర్‌బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలియగానే చాగలమర్రి, దువ్వూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అక్బర్‌బాషా కుటుంబానికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్టు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. దువ్వూరులోని ఎకరంన్నర భూమి అక్బర్‌బాషా అత్త ఖాసింబీదిగా మైదుకూరు కోర్టు 2018లోనే తీర్పు ఇచ్చిందిని ఎస్పీ తెలిపారు. మైదుకూరు కోర్టు తీర్పుపై ఎవరూ పై కోర్టుకు వెళ్లేదని, అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ కోర్టులో తేల్చకోవాలని ఆయన సూచించారు.