Ambati Rambabu: విజయవాడకు ప్రశాంత్ కిశోర్ రావడంపై మంత్రి అంబటి ఏమన్నారో తెలుసా?

ఎన్నికల్లో వైసీపీకి ఎదురయ్యే పరిస్థితులపై ఇప్పటికే జగన్‌కు ఐ ప్యాక్ పలు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. అయితే...

Ambati Rambabu: విజయవాడకు ప్రశాంత్ కిశోర్ రావడంపై మంత్రి అంబటి ఏమన్నారో తెలుసా?

Updated On : December 23, 2023 / 4:00 PM IST

Ambati Rambabu: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయవాడకు చేరుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్‌తో కలిసి ప్రశాంత్ కిశోర్… చంద్రబాబు నాయుడి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు-పీకే సమావేశం కావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు చేశారు. ‘మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రీ ఏం చేయగలడు?’ అంటూ ట్వీట్ చేశారు.

కొన్ని గంటల క్రితం అంబటి మరో ట్వీట్ చేశారు. ఒకరు ప్యాకేజీ కోసం, ఒకరు పుత్రుడి కోసం అంటూ పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఒకే ఒక్కరు జగన్ మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.

కాగా, 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురయ్యే పరిస్థితులపై ఇప్పటికే జగన్‌కు ఐ ప్యాక్ పలు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేకతపై పలు నివేదికలు జగన్ కు అందజేసినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ సూచనలను, హెచ్చరికలను జగన్ పట్టించుకోలేదని తెలుస్తోంది.

Prashant Kishor: ఎన్నికల వేళ విజయవాడకు ‘వ్యూహకర్త’ ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుతో భేటీ