Srikakulam Agency Village : వింత ఆచారం…గ్రామంలో పూజ జరుగుతున్నప్పుడు ఇతరులెవ్వరూ గ్రామంలోకి రాకూడదు

ఊరి పోలిమేర్లలోనే గ్రామానికి వెళ్లే రహదారులన్నింటిని మూసి వేస్తారు..సొంత గ్రామస్థులైనా ఆసమయంలో బైట ఊరికి వెళ్లినా ఒకసారి పూజ మోదలయ్యాక వారిని తిరిగి గ్రామంలోకి రానివ్వరు.

Srikakulam Agency Village : వింత ఆచారం…గ్రామంలో పూజ జరుగుతున్నప్పుడు ఇతరులెవ్వరూ గ్రామంలోకి రాకూడదు

Sklm Jarada Colony

Updated On : December 11, 2021 / 12:27 PM IST

Srikakulam Agency Village :  శ్రీకాకుళం జిల్లా  సీతంపేట ఏజెన్సీలోని   ప్రజలు వింత ఆచారంతో తమ గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  గ్రామంలో ప్రజలంతా సుఖ సంతోషాలుతో  ఉండాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు  చేస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.  అయితే ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా….అదే అసలు కథ….సీతంపేట ఏజేన్సీ గ్రామాల్లో గ్రామ దేవతలకు పూజ చేసినప్పుడు .. ఆ గ్రామానికి సభందించిన ప్రజలు తప్ప బయటవారిని ఎవ్వరినీ గ్రామంలోకి రానివ్వరు.

సీతంపేట ఏజెన్సీలోని జరడ కాలనీలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఊరి పోలిమేర్లలోనే గ్రామానికి వెళ్లే రహదారులన్నింటిని మూసి వేస్తారు..సొంత గ్రామస్థులైనా ఆసమయంలో బైట ఊరికి వెళ్లినా ఒకసారి పూజ మోదలయ్యాక వారిని తిరిగి గ్రామంలోకి రానివ్వరు.

sklm agency village

sklm agency village

ఇలా గ్రామం ఆచారాన్ని బట్టి 9 నుండి 21 రోజులు పాటు పూజలు చేస్తారు..ఇక ప్రస్తుతం డిసెంబర్ 4వ తేది నుండి 14వ తేదీ వరకు గ్రామంలో పూజలు జరుగుతున్నాయి. దీంతో ఆగ్రామనికి వెళ్లే రహదారులన్నీ బంద్ చేసారు. గ్రామ శివార్లులో హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేసారు.

సందమ్మ, గ్రామ అమ్మవారికి, గ్రామ పితృదేవతలకు మొక్కులు తీరుస్తున్నారు. తమ తాతలు,తండ్రుల కాలం నుండి వస్తున్న ఆచార సంప్రదాయాల ప్రకారం గ్రామదేవతలకు పూజలు చేస్తున్నామని, గ్రామంలోకి ప్రవేశించకుండ బైటవారు అందరూ సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.