AP Corona : ఏపీలో మళ్లీ కరోనా కలకలం, కొత్తగా ఎన్ని కేసులంటే..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో..

Ap Corona
AP Corona : ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 64వేల 739 నమూనాలు పరీక్షించగా 1,520 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,18,200కి చేరింది. కొత్తగా 10 మంది వైరస్ తో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,887 కి చేరింది.
కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒక్కరు మరణించారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 263 కేసులు వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 188 కొత్త కేసులు వెలుగుచూశాయి.
JioPhone Next : రూ.500కే జియో స్మార్ట్ ఫోన్..?
గడిచిన 24 గంట్లో 1,290 మంది కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,89,391కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,922 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,68,09,774 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన రాత్రి పూట కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కర్ఫ్యూ సమయాల్లో నిబంధనలు పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
WhatsApp Tricks: వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ఇలా చదవొచ్చు!
ఇక వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని ప్రభుత్వం చెప్పింది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
#COVIDUpdates: 03/09/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,15,305 పాజిటివ్ కేసు లకు గాను
*19,86,496 మంది డిశ్చార్జ్ కాగా
*13,887 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,922#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/G0NlYg9UiJ— ArogyaAndhra (@ArogyaAndhra) September 3, 2021