షర్మిల అరెస్ట్ విషయం నాకు తెలియదు.. సంక్రాంతి వేళ వేషాలు వేసుకొస్తారు.. అలాగే ఇప్పుడు ఎన్నికలు..: బొత్స

తమ ప్రాంతంలో సంక్రాంతి వేళ కొందరు వేషాలు వేసుకొస్తారని అన్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. కొందరు వాళ్ల వేషాలతో..

షర్మిల అరెస్ట్ విషయం నాకు తెలియదు.. సంక్రాంతి వేళ వేషాలు వేసుకొస్తారు.. అలాగే ఇప్పుడు ఎన్నికలు..: బొత్స

Minister Botsa Satyanarayana

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ విషయం తనకు తెలియదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము ప్రజాస్వామ్యయుతంగానే ఉంటామని చెప్పారు.

చట్టం తనపని తాను చేసుకుంటుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. తమ ప్రాంతంలో సంక్రాంతి వేళ కొందరు వేషాలు వేసుకొస్తారని అన్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. కొందరు వాళ్ల వేషాలతో వాళ్లు వస్తారని తెలిపారు. రాజకీయ పార్టీలు తపస్సులు చేసుకుంటాయా అని నిలదీశారు. సభలు సమావేశాలు పెట్టుకోవాలిగా.. అని అన్నారు.

ఈ నెల 27 చలో విజయవాడ ను విరమించుకోమని ఏపీ జేఏసీ నేతలను కోరామని బొత్స సత్యనారాయణ చెప్పారు. పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామని తెలిపారు. మార్చి నెలలోపు బకాయిల చెల్లింపును పూర్తి చేస్తామని చెప్పారు. ఐఆర్ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వ విధానం కాదని, సమయానికి పీఆర్సీ ఇస్తామని తెలిపారు.

 Read Also: 28న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి : నాదెండ్ల మనోహర్