ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అది అమరావతే- సీఎం చంద్రబాబు
అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని వైసీపీ విష ప్రచారం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Amaravati : ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అది అమరావతే.. అని నినదించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని అని, అది అమరావతేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ జరిగిందన్నారు చంద్రబాబు. 121 వ రోజు మళ్లీ వచ్చి సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభిస్తానని చెప్పారు.
విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేస్తామన్నారాయన. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రూ.160 కోట్లతో గతంలో సీఆర్డీయే కార్యాలయ పనులు చేపట్టారు. ఆ పనులను సీఎం చంద్రబాబు ఇవాళ తిరిగి ప్రారంభించారు.
అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని వైసీపీ విష ప్రచారం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని వ్యాఖ్యానించారు. నగరాభిృద్ధికి ప్రభుత్వ నిధులతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అమరావతి-హైదరాబాద్-చెన్నై-బెంగళూరు మీదుగా 2027 నాటికి బుల్లెట్ రైలు సైతం ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు చంద్రబాబు. నిర్మాణ పనులు ఐదేళ్లు జాప్యం కావడం వల్ల అమరావతిపై రూ.7వేల కోట్ల అదనపు భారం పడుతుందని వాపోయారు. పర్యావరణ పరిరక్షణకు అమరావతిలో పెద్ద పీట వేశామన్నారు సీఎం చంద్రబాబు.
”నేను రాష్ట్రం మొత్తం తిరిగి తిరిగి చెప్పాను. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అదే అమరావతి.. అని చాలా స్పష్టంగా పదే పదే చెప్పాం. వీళ్లు విశాఖకు వెళ్లి కావాలని మభ్య పెడితే.. మీ ఆమోదంతో చేశానా లేదా అని అడిగాను. మన రాజధాని ఏది అంటే.. అమరావతే మన రాజధాని అని.. విశాఖ, కర్నూలులో చెప్పించానంటే.. అది ప్రజలకు ఉండే విశ్వాసం, నమ్మకం. ఇంకో మాట కూడా చెప్పా. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ మాత్రమే కాకుండా పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పాను. ఆ మాటకు కట్టుబడి అనేక పనులు చేస్తున్నాం. గత ఐదేళ్ల పాలనలో ఇక్కడ పనులు ఆగిపోయాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఒక పక్క వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, మళ్లీ ఆదాయాన్ని పెంచాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read : రాజధాని నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం.. టార్గెట్ మూడేళ్లు..