వైసీపీ మ్యానిఫెస్టో రెడీ.. సిద్ధం సభలో విడుదల?
ఈ సభలను వ్యూహాత్మకంగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు.

YS Jagan
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసే క్రమంలో సీఎం జగన్ వరుసగా సిద్ధం సభలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు మరికొన్ని వారాలే సమయం ఉండడంతో అన్ని విధాలుగా వైసీపీ సన్నద్ధం అవుతోంది. రాష్ట్రంలో భీమిలి, దెందులూరు, రాప్తాడు ప్రాంతాల్లో సిద్ధం మహాసభలు విజయవంతమైన నేపథ్యంలో చివరి సభకు వైసీపీ సన్నద్ధమైంది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పూరు దగ్గర మార్చి 2న భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తోంది. ఇదే వేదిక మీద నుంచి ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయడానికి వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సభలను వ్యూహాత్మకంగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు.
బొప్పూడి వద్ద 200 ఎకరాల స్థలంలో ఈ సభకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సిద్ధం సభను నిర్వహిస్తారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈ సారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 2019 ఎన్నికల్లో మినహా అప్పటి వరకు టీడీపీ పట్టు సాధించిన నియోజకవర్గాల్లోనే సిద్ధం సభకు వేదికలుగా వైసీపీ నిర్ణయిస్తోంది.
సిద్ధం సభ జరిగిన తర్వాత క్యాబినెట్ సమావేశం జరగనుంది. పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిద్ధం సభకు ముందే మిగిలిన అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చేసే యోచనలో జగన్ ఉన్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి నోటీసులు