AP Covid – 19 : కరోనా పంజా..24 గంటల్లో 984 కేసులు

ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

AP Covid – 19 : కరోనా పంజా..24 గంటల్లో 984 కేసులు

Corona Cases In Andhra Pradesh 2

Updated On : March 26, 2021 / 6:44 PM IST

Corona Cases : ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి చిత్తూరు, విశాఖపట్టణంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అత్యధికంగా గుంటూరులో 176, విశాఖపట్టణంలో 170, చిత్తూరులో 163 కరోనా కేసులు వెలుగు చూశాయి.

40 వేల 604 శాంపిల్స్ పరీక్షించగా..948 మంది కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో 36 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారని వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రంలో 1,49,16,201 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 93 వేల 968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 లక్షల 82 వేల 620 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా..ఈ వైరస్ కారణంగా.. 7 వేల 203 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4 వేల 145గా ఉంది.

14వ తేదీ 298
15వ తేదీ 147
16వ తేదీ 261
17వ తేదీ 253
18వ తేదీ 218

19వ తేదీ 246
20వ తేదీ 380
21వ తేదీ 368
22వ తేదీ 310
23వ తేదీ 492

24వ తేదీ 585
25వ తేదీ 758
26వ తేదీ 948

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 46. చిత్తూరు 163. ఈస్ట్ గోదావరి 49. గుంటూరు 176. వైఎస్ఆర్ కడప 31. కృష్ణా 110. కర్నూలు 54. నెల్లూరు 89. ప్రకాశం 27. శ్రీకాకుళం 42. విశాఖపట్టణం 170. విజయనగరం 15. వెస్ట్ గోదావరి 12. మొత్తం కేసులు : 984