Rains : కోస్తా.. రాయలసీమకు మోస్తారు వర్షాలు

ఏపీలో నేటి నుంచి వర్షాలు పడనున్నాయి. ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Rains : కోస్తా.. రాయలసీమకు మోస్తారు వర్షాలు

Ap Rain

Updated On : August 8, 2021 / 2:26 PM IST

rain in AP : ఏపీలో నేటి నుంచి వర్షాలు పడనున్నాయి. పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మచిలీపట్నం, గుంటూరు మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఫలితంగా ఆదివారం నుంచి కోస్తా, రాయలసీమల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 13వ తేదీ తరువాత వర్షాలు ఊపందుకుంటాయని వెల్లడించారు. కాగా గత 24 గంటల్లో రాయలసీమలో పలు చోట్ల, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి.