Malladi Chandrasekhar Shastry: ప్రవచనకర్త చంద్రశేఖర శాస్త్రి అస్తమయంపై జనసేనాని సంతాపం

ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం పరమపదించారు.

Malladi Chandrasekhar Shastry: ప్రవచనకర్త చంద్రశేఖర శాస్త్రి అస్తమయంపై జనసేనాని సంతాపం

Malladi

Updated On : January 14, 2022 / 9:23 PM IST

Malladi Chandrasekhar Shastry: ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం పరమపదించారు. పురాణాలను శాస్త్రబద్ధంగా బోధించడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆస్థాన శాశ్వత పండితుడిగా చంద్రశేఖర శాస్త్రి ప్రసిద్ధి కెక్కారు. 1925లో ఆగష్టు 28న గుంటూరుజిల్లా క్రోసూరులో జన్మించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం:
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి పరమపదించడం విచారకరం. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా సాగిన వారి ప్రవచనాలు మార్గనిర్దేశనం చేసేవి అని ట్విట్టర్లో పోస్టు పెట్టి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంతాపం:
‘ప్రముఖ పండితులు, ప్రవచనకర్త శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమించారనే విషయం బాధ కలిగించింది. ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికీ చిరపరిచితమే. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, ఆధ్యాత్మిక చింతన పెంచేలా శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారి ఉపన్యాసాలు సాగేవి. ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెంచారు. ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు.