Tenth Inter Exams : జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుతుందన్న మంత్రి.. జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందన్నారు.

Tenth Inter Exams : జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Updated On : June 15, 2021 / 8:18 PM IST

Tenth Inter Exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుతుందన్న మంత్రి.. జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందన్నారు. ఇంటర్ మార్కులకు ఎంసెట్ పరీక్షలకు లింక్ ఉందని చెప్పారు. జూలై ఆఖరున 10వ తరగతి పరీక్షలు నిర్వహణకు అవకాశం ఉందన్నారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించి గురువారం సీఎం జగన్ దగ్గర చర్చిస్తామన్నారు. ఎగ్జామ్స్ రద్దు చేయడం నిమిషం పట్టదన్న మంత్రి.. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవడం కరెక్ట్ కాదన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉందని స్పష్టం చేశారు.

”కరోనా సెకండ్ వేవ్ తీవ్ర తగ్గుముఖం పడుతోంది. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. ఇంటర్ పరీక్షలు బహుశా జూలై మొదటి వారంలో జరగొచ్చు. జూలై చివరి వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. జూలైలో పరీక్షలు నిర్వహించలేకపోతే ఇక అవకాశం ఉండదని భావిస్తున్నాం.

కచ్చితంగా జూలైలోనే పరీక్షలు పెడతామని చెప్పడం లేదు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణపై సమీక్షించుకుంటున్నాము. పరీక్షలు రద్దు చేయడం అనేది మాకు ఎంతో సులభమైన పని. ఒక్క నిమిషంలో చేయగలం. కానీ తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేరళ, బీహార్ రాష్ట్రాలు విద్యార్థులకు పరీక్షలు జరిపాయి. ఛత్తీస్ గఢ్ కూడా పరీక్షలు జరుపుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని పరీక్షలు జరుపుతాము. కరోనా తప్పిస్తే పరీక్షలకు ఇంకేం అడ్డండి ఉంటుంది” అని మంత్రి సురేష్ అన్నారు.

Read:Teachers Recruitment : ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు