Minister Narayana : ఇప్పటికే రూ.22 వేల కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం లభించింది- రాజధాని అమరావతిపై మంత్రి నారాయణ
ఈ 6 నెలల కాలంలో అనేక అడ్డంకులు వచ్చాయి. గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన జీవోలన్నీ..

Minister Narayana : ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. సుమారు 4 గంటల పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసే ఈ 11, ఈ 13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు, పశ్చిమ బైసాస్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆ తర్వాత వెంకటపాలెం దగ్గర కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు.
గత వైసీపీ సర్కార్ ఏపీకి రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడిందని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తున్నామన్నారు మంత్రి నారాయణ. ఇప్పటికే 22వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లకు ఆమోదం లభించిందన్నారు.
‘అమరావతి రాజధాని కోసం భూములు ఇవ్వాలని నాడు రైతులను అడిగాం. 58 రోజుల్లో రైతులు స్వచ్చందంగా 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ ప్రపంచస్థాయి రాజధాని కడతానని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దాని మీద సింగపూర్ వాళ్లతో లేఔట్స్ డిజైన్ చేయించారు. బిల్డింగ్స్ డిజైన్ చేయించారు. అయితే అనుకోకుండా ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది.
ఏపీకి రాజధాని లేకుండా చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉండాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతిలో రాజధాని కడతామన్నారు. ఈ 6 నెలల కాలంలో అనేక అడ్డంకులు వచ్చాయి. గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన జీవోలన్నీ మళ్లీ తీసుకురావటానికి చర్యలు చేపట్టాం. అధారిటీ మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ లో డిస్కస్ చేశాం. కొన్ని అసెంబ్లీలో పెట్టి అప్రూవల్ తీసుకున్నాం. అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.
రోడ్లు, భవనాలకు సంబంధించి టెండర్లు దాదాపు 22వేల కోట్లకు సంబంధించి అథారిటీ ఇవాళ అప్రూవల్ ఇచ్చింది. సోమవారం మరోసారి అథారిటీ మీటింగ్ ఉంది. అందులో సుమారుగా 20వేల కోట్లకు టెండర్లకు అప్రూవల్ తీసుకుని.. ఈ నెలాఖరులోపు అన్ని టెండర్లు పిలవడం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ.. 217 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా 16 రోడ్లు ఉంటాయి. నార్త్ సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లను నేషనల్ హైవేలో కలపాలి’ అని మంత్రి నారాయణ తెలిపారు.
Also Read : YSRCP: వైసీపీలో కాపు నేతలు ఖాళీ అవుతున్నారా?