Nadendla Manohar: పవన్ కల్యాణ్‌పై అందుకే కుట్రపూరితంగా కేసుపెట్టారు: నాదెండ్ల
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పవన్‌పై వ్యక్తిగతంగా దాడి చేశారని నాదెండ్ల అన్నారు.

Nadendla Manohar
గుంటూరు జిల్లా కోర్టులో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై కుట్రపూరితంగా కేసు నమోదు పెట్టారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై మూడు ప్రశ్నలు అడిగారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థకు హెడ్ ఎవరు?డేటాను ఎవరికి అందిస్తున్నారు? డేటా సేకరించాలని ఎవరు చెబుతున్నారు? అని అడిగారని తెలిపారు.
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పవన్‌పై వ్యక్తిగతంగా దాడి చేశారని నాదెండ్ల అన్నారు. వార్డ్ సచివాలయ చట్టంలో ఎక్కడా వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పలేదని తెలిపారు. 2.60 లక్షల మంది వాలంటీర్లలో 1,02,530 మంది వాలంటీర్లకు సంబంధించిన సమాచారం అప్ లోడ్ కాలేదని అన్నారు. రూ.1,500 కోట్ల ఫీల్డ్ ఆపరేషన్ ఏజన్సీకి కట్టబెట్టారని చెప్పారు.
ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్టు సర్వీస్ పేరుతో వాలంటీర్‌కు చెల్లింపులు చేస్తున్నారని అన్నారు. సేవా కార్యక్రమాల రూపంలో దోపిడీ చేస్తున్నారని చెప్పారు. కాగా, గత ఏడాది జూలై 9న వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారినట్లు సర్కారు పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో గుంటూరు కోర్టులో పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఈ కేసు నమోదు కావడం గమనార్హం. వాలంటీర్లపై కొన్ని నెలల క్రితం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.
Read Also: కొడాలి నాని సీటు కిందకు నీళ్లు.. వంశీ పారిపోయాడు: బొండా ఉమ హాట్ కామెంట్స్