Pawan Kalyan: రూ.10 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్.. పార్టీ నేతలతో ఏమన్నారో తెలుసా?

ప్రజారాజ్యంలో ఉన్న చిన్న పరిచయంతో ఓ నేతకు రెండు సార్లు టీడీపీలో అవకాశం వచ్చేలా చేశానని తెలిపారు.

Pawan Kalyan: రూ.10 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్.. పార్టీ నేతలతో ఏమన్నారో తెలుసా?

Pawan Kalyan

Updated On : February 19, 2024 / 4:33 PM IST

పార్టీ నిధి కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. ఏపీ ఎన్నికల వేళ ఆయన వరుసగా నాలుగు రోజుల పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో పవన్ సమావేశమై మాట్లాడారు.

తమ కూటమి అధికారంలోకి వస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని అన్నారు. మూడింట ఒకవంతు పదువులు దక్కించుకుందామని చెప్పారు. 2019 తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు తాను భరోసా ఇచ్చానని తెలిపారు. భవిష్యత్తులో జనసేనకు మరిన్ని పదవులు రాబోతున్నాయని అన్నారు.

ప్రజారాజ్యంలో ఉన్న చిన్న పరిచయంతో ఓ నేతకు రెండు సార్లు టీడీపీలో అవకాశం వచ్చేలా చేశానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఏపీకి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని నిపుణులు చెబుతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.

JanaSena

JanaSena

Perni Nani: మీరు ఊరూరా తిరిగి కుర్చీలు తెచ్చుకున్నంత మాత్రాన..: పేర్ని నాని