Nari Sankalpa Deeksha : టీడీపీ నారీ సంకల్ప దీక్షపై పోలీసుల ఆంక్షలు

టీడీపీ నారీ సంకల్ప దీక్షకు పోలీసులు ఆంక్షలు విధించారు. దీక్షకు వస్తున్న టీడీపీ మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీక్ష ఆగదని..

Nari Sankalpa Deeksha : టీడీపీ నారీ సంకల్ప దీక్షపై పోలీసుల ఆంక్షలు

Nari Sankalpa Deeksha

Updated On : January 30, 2022 / 11:13 PM IST

Nari Sankalpa Deeksha : నారీ సంకల్ప దీక్షకు ప్రతిపక్ష టీడీపీ సిద్ధమవుతోంది. సోమవారం నారీ సంకల్ప దీక్ష చేపట్టనుంది. అయితే, దీనిపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. అమరావతిలో జరిగే నారీ సంకల్ప దీక్షకు వస్తున్న టీడీపీ మహిళలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నుండి వస్తున్న అనంతపురం మాజీ మేయర్ స్వరూపను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా సంకల్ప దీక్ష కొనసాగుతుందని తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపుడి అనిత తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నారీ సంకల్ప దీక్ష చేపట్టనున్నారు.

వంగలపూడి అనిత ‘నారీ సంకల్ప దీక్ష’ పేరుతో ఈ దీక్షను చేపట్టనున్నారు. వాస్తవానికి శుక్రవారం నాడు దీక్షను చేపట్టాలని భావించినప్పటికీ ఆమె దీక్ష వాయిదా పడింది. తన దీక్షకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదని… అందుకే సోమవారానికి దీక్షను వాయిదా వేశానని ఆమె తెలిపారు.

Crab Blood : ఈ పీతల రక్తం లీటర్ ధర రూ.12 లక్షలపైనే.. ఎందుకో తెలుసా?

ఈ నెల 31న విజయవాడలో దీక్షను చేపడతానని ఆమె చెప్పారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ఆమె విమర్శించారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని… వీటన్నింటినీ నిరసిస్తూ తెలుగు మహిళ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్టు అనిత తెలిపారు.

మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్ పాలనని నిరసిస్తూ జనవరి 31న టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరగనున్న నారీ సంకల్ప దీక్షకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు. భద్రత- భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి అన్ని విధాలా అండగా నిలుస్తానని తెలిపారు.

Over Weight : అధిక బరువుకు ఆయుర్వేదంతో చెక్

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని లోకేష్ అన్నారు. అక్క, చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందంటూ కురిపించిన ప్రేమ, ఆప్యాయత ఎక్కడికి పోయాయి? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. జగన్ పాలనలో బాగుండటం దేవుడెరుగు.. బతికి ఉండటమే అదృష్టంగా భావించే దురదృష్ట రోజులు దాపురించాయని అన్నారు. పట్టపగలు కూడా మహిళలు రోడ్డుపై నడవలేని దుస్థితి ఉందన్నారు. రోజుకో దుర్మార్గుడు, వైసీపీ ముసుగు కప్పుకున్న నీచులు ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆరోపించారు.