Roja: అందులో తప్పేముంది?: మంత్రి రోజా ఆగ్రహం
పచ్చకామెర్లు ఉన్నవారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని, అసెంబ్లీ సీట్లు అమ్ముకోవడం వంటి పనులు చంద్రబాబే చేస్తారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఈసారి 175కు 175 సీట్లు గెలుస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విజయ కేతనం ఎగర వేస్తారని అన్నారు. ఎమ్మెల్యేల మార్పుపై ఎప్పుటినుంచో చెప్పుకు వస్తున్నారని తెలిపారు. ఎవరు సక్రమంగా పని చేయరో వారిని మార్చుతున్నారని, అందులో తప్పేముందని నిలదీశారు.
పచ్చకామెర్లు ఉన్నవారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని, అసెంబ్లీ సీట్లు అమ్ముకోవడం వంటి పనులు చంద్రబాబే చేస్తారని అన్నారు. సర్వేల ద్వారా జగన్ ప్రజల మనసు తెలుసుకుంటున్నారని, జనాలు మెచ్చేవారికే టికెట్లు ఇస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు నాయుడు సంక్రాంతిలోగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తానని చెప్పారని, ఎందుకు విడుదల చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఏపీని చంద్రబాబు అప్పుల ఊబిలోకి లాగారని చెప్పారు. ఏపీని జగన్ సమర్థవంతంగా పరిపాలిస్తున్నారని అన్నారు. టీడీపీకి 175 నియోజకవర్గాలలో అభ్యర్థులు లేరని చెప్పారు.
చంద్రబాబు ఎన్ని పార్టీలతో కలిసినా ఆయన అభ్యర్థులు లేరని విమర్శించారు. కుప్పం నుంచి విజయం సాధించే అవకాశాలు లేవని, రెండో నియోజక వర్గం కోసం చంద్రబాబు వెతుకుతున్నారని ఆరోపించారు. లోకేశ్, పవన్ కల్యాణ్ కు కూడా ఇదే భయం ఉందని అన్నారు. ఎంత మంది కలిసినా జగన్ ను ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. పవన్ ఏపీలో రెండు చోట్ల ఓడిపోయారని ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు. పవన్ గురించి మాట్లాడటం కూడా అనవసరమని చెప్పారు. జగన్ పాలనలో ప్రజల జీవితాలు మారాయని చెప్పారు.
జగనన్న పాలనలో…
మౌలిక సదుపాయాలు మారాయి,
పాలన మారింది,
ప్రజావైద్యం మారింది,
బడి మారింది,
వ్యవసాయం మారింది,
మన ఊరు మారింది,
మన జీవితాలు మారాయి,❛ ఇది కదా మార్పు
అంటే..ఇది కదా
అభివృద్ధి అంటే..❜#VooruMarindi#YSJaganAgain #APWithYSJagan#NagariWithRKRoja… pic.twitter.com/gBQZvXA2k8— Roja Selvamani (@RojaSelvamaniRK) January 12, 2024
Konathala Ramakrishna: పవన్ కల్యాణ్‌తో సమావేశం కానున్న కొణతాల రామకృష్ణ.. ఆ సీటు నుంచి పోటీ?