Chandrababu Custody : వాట్ నెక్స్ట్.. ముగిసిన చంద్రబాబు కస్టడీ, 14గంటల పాటు విచారించిన సీఐడీ

రెండు రోజుల విచారణకు సంబంధించిన నివేదికను, వీడియో ఫుటేజీని సీల్డ్ కవర్ లో కోర్టుకి సమర్పించనుంది సీఐడీ. Chandrababu CID Custody

Chandrababu Custody : వాట్ నెక్స్ట్.. ముగిసిన చంద్రబాబు కస్టడీ, 14గంటల పాటు విచారించిన సీఐడీ

Chandrababu CID Custody Ends

Updated On : September 24, 2023 / 5:55 PM IST

Chandrababu CID Custody : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు రెండు రోజుల కస్టడీ ముగిసింది. రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 23,సెప్టెంబర్ 24) సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని విచారించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కి సంబంధించి ప్రశ్నలు సంధించారు. 14 గంటల పాటు చంద్రబాబుకి ప్రశ్నలు వేశారు.

విచారణ ముగియడంతో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత చంద్రబాబును జైలు అధికారులకు అప్పగిస్తారు. రెండో రోజు కస్టడీ ముగియడంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు రెండు రోజుల విచారణకు సంబంధించిన నివేదికను, వీడియో ఫుటేజీని సీల్డ్ కవర్ లో కోర్టుకి సమర్పించనుంది సీఐడీ. ఇప్పటికే ఏసీబీ కోర్టుకు న్యాయమూర్తి చేరుకున్నారు. చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టు దగ్గరికి వెళ్లారు.

కాగా, నేటితో(సెప్టెంబర్ 24) చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్, రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.(Chandrababu CID Custody)

Also Read..Motkupalli Narasimhulu : చివరికి దేవాన్షును కూడా జగన్ అరెస్ట్ చేస్తాడేమో! చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మోత్కుపల్లి నిరసన దీక్ష

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును 5రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరగా.. ఏసీబీ కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. నిన్న(సెప్టెంబర్ 23), ఇవాళ(సెప్టెంబర్ 24) సీఐడీ అధికారులు రాజమండ్రి జైల్లో చంద్రబాబుని విచారించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు.

చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్, కస్టడీ ముగియడంతో తర్వాత ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు రిమాండ్ తో పాటు కస్టడీని పొడిగించాలని సీఐడీ అధికారులో కోర్టులో పిటిషన్ వేయనున్నారని తెలుస్తోంది. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏ విధంగా నిర్ణయం ఇస్తారు అనేది ఉత్కంఠగా మారింది.

Also Read..AP BJP president Purandeshwari : వైసీపీ ప్రభుత్వం తీరుతో.. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరువయ్యే పరిస్థితి నెలకొంది

ఇవాళ ఉదయం 9.30 గంటలకు సీడీఐ అధికారుల విచారణ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 14 గంటల పాటు విచారించారు. కస్టడీ విచారణ తోపాటు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తవడంతో.. న్యాయూమూర్తి ముందు చంద్రబాబుని వర్చువల్ గా హాజరుపరుస్తారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తారా? లేక కస్టడీ పొడిగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. కాగా, చంద్రబాబుని మళ్లీ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరనుందని సమాచారం.(Chandrababu CID Custody)

స్కిల్ స్కామ్ కేసులో 140 మంది సాక్షులు ఇచ్చిన ఇన్ పుట్స్ ను చంద్రబాబు ముందు ఉంచి సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. టెక్నికల్ డాక్యుమెంట్స్ చూపించి నిధులు ఎందుకు కేటాయించాల్సి వచ్చింది అనే అంశంపై అధికారులు చంద్రబాబుని ఆరా తీసినట్లు సమాచారం. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, స్కిల్ సెంటర్ లో ప్రపోజల్ లో ఉండగానే నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇలా దాదాపు 120 ప్రశ్నలు ఆన్ పేపర్ ద్వారా చంద్రబాబుని పలు కోణాల్లో పలు అంశాల గురించి విచారించినట్లు తెలుస్తోంది.