Pawan Kalyan : జనసేనాని జిల్లాల పర్యటనకు ప్రత్యేక హెలికాప్టర్.. ప్రతి జిల్లాలో మూడుసార్లు పర్యటించేలా ప్రణాళిక

ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొదటి పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్షలు, రెండు, మూడు పర్యటనల్లో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధమవుతుందట.

Pawan Kalyan : జనసేనాని జిల్లాల పర్యటనకు ప్రత్యేక హెలికాప్టర్.. ప్రతి జిల్లాలో మూడుసార్లు పర్యటించేలా ప్రణాళిక

Pawan kalyan

Updated On : February 13, 2024 / 5:06 PM IST

Janasena Pawan Kalyan : ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల రణరంగంలోకి దూకారు. టీడీపీ – జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించుకోగా.. నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది. మరోవైపు చంద్రబాబు, లోకేశ్ జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల వారిగా పర్యటనలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధమైంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు. దీంతో వీలును బట్టి ప్రతీ నియోజకవర్గంలో పవన్ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Also Read : ప్లేస్ మారింది, నేను మారలేదు.. నాలో ఫైర్ అలాగే ఉంది.. అనిల్ కుమార్ యాదవ్

ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొదటి పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్షలు, రెండు, మూడు పర్యటనల్లో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సభల్లో పాల్గొనేలా పవన్ షెడ్యూల్ సిద్ధమవుతుందట. రేపటి నుంచి పవన్ గోదావరి జిల్లాల్లో మొదటి పర్యటన ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో పవన్ సమీక్షల్లో పాల్గొంటారు. రేపు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో, 15న గురువారం అమలాపురంలో జిల్లా ముఖ్యనేతలతో, 16వ తేదీన కాకినాడలో మరోసారి పవన్ సమీక్షలు చేయనున్నారు. ఈనెల 17వ తేదీన శనివారం రాజమండ్రిలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం అవుతారు.

Also Read : ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతల కీలక వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ పర్యటనలకు హెలికాప్టర్ లో వెళ్లనున్నారు. రాత్రి తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకునేలా పవన్ షెడ్యూల్ ను పార్టీ నేతలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో టికెట్ల విషయంపై పార్టీ ముఖ్యనేతలతో, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు వీలుగా జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పటికీ రాత్రి వేళల్లో పవన్ అందుబాటులో ఉండేలా పార్టీ నేతలు పవన్ పర్యటనలను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.