నాగేశ్వరరావును చంపేసిన రౌడీ షీటర్

  • Published By: madhu ,Published On : August 23, 2020 / 10:07 AM IST
నాగేశ్వరరావును చంపేసిన రౌడీ షీటర్

Updated On : August 23, 2020 / 10:16 AM IST

ప్రకాశం జిల్లా తోటవారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో గొడవ చేస్తుండడంతో మందలించిన రిటైర్డ్ ASI నాగేశ్వరరావుపై రౌడీషీటర్ సురేంద్ర కర్రలతో విచాక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

2020, ఆగస్టు 22వ తేదీ శనివారం వినాయక చవితిని జిల్లా ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు. తోటవారిపాలెంలో రౌడీ షీటర్ సురేంద్ర మద్యం మత్తులో గొడవ చేస్తున్నాడు. దీంతో రిటైర్స్ ఏఎస్ఐ జోక్యం చేసుకున్నాడు. అర్ధరాత్రి గొడవ ఏంటీ ? అని మందలించాడు.

తీవ్ర ఆగ్రహానికి గురైన సురేంద్ర..ఇంట్లోకి చొరబడి..కర్రలతో దాడికి పాల్పడ్డాడు. ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడనే చనిపోయాడు. అనంతరం సురేంద్ర పారిపోయాడు.

నాగేశ్వర్ చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సురేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.