బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు : ముగ్గురు మృతి 

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 04:15 PM IST
బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు : ముగ్గురు మృతి 

కర్నూలు : బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రానికి వెళ్లి వస్తోంది. యాగంటి క్షేత్రం సమీపంలో బైక్ పై వస్తున్న ముగ్గురిని బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతుల్లో ఇద్దరు యువతులు, యువకుడు ఉన్నారు. మృతులు శిరీష, సుమన్, కుమారిగా గుర్తించారు. వీరు కర్నూరు ఓమేగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.