వైఎస్సార్ బయోపిక్: మేకింగ్ వీడియో రిలీజ్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకధ ఆధారంగా నిర్మిస్తున్నయాత్ర సినిమా మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం రిలీజ్ చేసింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకధ ఆధారంగా నిర్మిస్తున్నయాత్ర సినిమా మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం రిలీజ్ చేసింది.
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కధ ఆధారంగా, ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి హీరో గా నటిస్తున్న యాత్ర సినిమా నిర్మాణ దశలో ఉండి ఫిబ్రవరి 8నవిడుదల కాబోతోంది. మహి.వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివా మేకా సమర్పణలో 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మిస్తున్నారు.
జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్, సచిన్ ఖేడ్కర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన చిత్ర యూనిట్ టీజర్ ట్రైలర్ లతో అభిమానులను అలరిస్తోంది, లేటెస్ట్ గా వాయిస్ ఆఫ్ యాత్ర పేరుతో మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది.