ఇవాళ ఒక్కరోజే రూ.వెయ్యి పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..

Gold
Gold And Silver Price Today : బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారంపై రూ. 1000 పెరిగింది. గత కొన్నేళ్లుగా ఒక్కరోజులోనే బంగారం ధర రూ. వెయ్యి పెరగడం చాలా అరుదు. గత నెలలో, మార్చి మొదటి వారంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. అయితే, గతవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగు రోజులు గోల్డ్ ధరల్లో తగ్గుదల కనిపించింది. తాజాగా గురువారం రికార్డు స్థాయిలో బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు తాజా ధరలనుచూసి బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వెండిధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 1500 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,420 మార్క్ కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 67,570.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 61,800 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 67,420.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.62,350 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.68,020 మార్క్ కు చేరింది.
పెరిగిన వెండి ధర ..
దేశం వ్యాప్తంగా వెండిధర భారీగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 81,500 చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 81,500 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.78,500 కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.76,000 మార్క్ కు చేరింది.