ప్రేమ, పెళ్లి పేరుతో మోసం….యువతి ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : October 25, 2020 / 01:01 PM IST
ప్రేమ, పెళ్లి పేరుతో మోసం….యువతి ఆత్మహత్య

Updated On : October 25, 2020 / 1:34 PM IST

young woman commits suicide : ప్రేమిస్తున్నా… పెళ్లి చేసుకుంటానని యువతితో కొన్నాళ్లు తిరిగి పెళ్లి చేసుకోమనే సరికి ముఖం చాటేయటంతో , యువతి ఆత్మహత్య చేసుకుంది. నేరేడ్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని జేజే నగర్ లో నివసించే అరుణ(21) అనే యువతి కరోనా లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉంటోంది.

ఆర్మీ క్యాంటిన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసి,మానేసిన అమ్ముగూడకు చెందిన జాన్సన్(27)తో అరుణకు పరిచయం అయ్యింది. ప్రేమిస్తున్నానని…. పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఆమెను నమ్మించాడు. కొన్నాళ్లు ఇద్దరూ కలిసి తిరిగారు. ఇటీవల అరుణ పెళ్లి చేసుకోమని వత్తిడి చేయసాగింది. అప్పటినుంచి జాన్సన్ ముఖం చాటేసి తిరగటం మొదలెట్టాడు.


అతడి గురించి విచారించగా…. అప్పటికే జాన్సన్ కు పెళ్లై భార్య ఉందని తెలుసుకుంది. దీంతో మనస్తాపం చెందిన అరుణ సూసైడ్ నోట్ రాసి… ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. సూసైడ్ నోట్ లో నా ఆత్మహత్యకు జాన్సన్ కారణం అని రాసి ఉందని నేరేడ్ మెట్ పోలీసు స్టేషన్ ఎస్ఐ నర్సింహస్వామి తెలియచేశారు.