Road Accident : రెండు ఆర్టీసి బస్సులు ఢీ-ఇద్దరు డ్రైవర్లతో సహా నలుగురు మృతి

Road Accident : రెండు ఆర్టీసి బస్సులు ఢీ-ఇద్దరు డ్రైవర్లతో సహా నలుగురు మృతి

Road Accident In Vizianagaram

Updated On : March 29, 2021 / 1:12 PM IST

4 killed in a Road Accident in Vizianagaram District : విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నరెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో సహా నలుగురు మరణించారు.

విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ-విజయనగరం జాతీయ రహాదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుదెరుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఆర్టీసి డ్రైవర్లతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రక్కన ఉన్న డంపిగ్ యార్డ్ లోని చెత్తకు నిప్పు పెట్టటంవల్ల ఆ ప్రాంతంమంతా దట్టంగా పొగ అలుముకుంది. దీంతో ఎదురుకుండా వచ్చే వాహానాలు కనపడకపోవటంతో ఈప్రమాదం జరిగినట్లు స్ధానికులు చెపుతున్నారు.

ఆర్టీసి బస్సులు ఢీకొట్టిన  క్రమంలో ….ఒక బస్సు వెనుకగా వస్తున్న సిలిండర్ల లారీ కూడా ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. అయితే సిలిండర్ల వల్ల ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని  ప్రయాణికులు భావిస్తున్నారు. ఘటానా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహయక చర్యలు చేపట్టారు.