షాకింగ్.. డ్రగ్స్ అమ్ముతూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అరెస్ట్, న్యూఇయర్ వేళ హైదరాబాద్‌లో కలకలం

నూతన సంవత్సర వేడుకలను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయదారులు రెచ్చిపోతున్నారు. ప్రతీ ఏటా న్యూఇయర్ వేడుకల్లో మత్తు పదార్ధాల వినియోగం విరివిగా ఉందనే సమాచారం ఉంది. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో అనేక డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి.

షాకింగ్.. డ్రగ్స్ అమ్ముతూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అరెస్ట్, న్యూఇయర్ వేళ హైదరాబాద్‌లో కలకలం

Hyderabad Drugs Seize (Photo : Google)

Updated On : December 31, 2023 / 8:45 PM IST

Hyderabad Drugs Seize : న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా మత్తు పదార్ధాలు పట్టుబడుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు నూతన సంవత్సర వేడుకలను టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి.

నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులు 9కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీబీఎస్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో బైక్ పై ఇద్దరు వచ్చారు. వారి కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు వారిని ఆపి చెక్ చేయగా వారి వద్ద 9 కిలోల ఎండు గంజాయి దొరికింది. వారిద్దరూ ఒడిశా వాసులు. ఒడిశా నుండి గంజాయి తీసుకొచ్చి తెలంగాణలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. వారి నుండి బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులు.

Also Read : దొరికితే.. 6నెలలు జైలు, రూ.10వేలు ఫైన్.. న్యూఇయర్ వేడుకలకు పోలీసుల కొత్త రూల్స్

7.5 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్
అటు.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2లక్షల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నుంచి 7.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్.ఓ.టి పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడులు చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దగ్గర డ్రగ్స్ ఉండగా.. అది కొనేందుకు వచ్చిన అర్జున్ (25), దేవేందర్ (23, సాఫ్ట్ వేర్ ఉద్యోగి) ను ట్రాప్ చేసి ముగ్గురినీ ఒకేసారి పట్టుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నూతన సంవత్సర వేడుకలను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయదారులు రెచ్చిపోతున్నారు. ప్రతీ ఏటా న్యూఇయర్ వేడుకల్లో మత్తు పదార్ధాల వినియోగం విరివిగా ఉందనే సమాచారం ఉంది. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో అనేక డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి. తాజాగా గడిచిన కొద్దిరోజులగా నగరంలో డ్రగ్స్ పట్టుబడుతోంది. న్యూ ఇయర్ వేడుకులకు సంబంధించి నగరంలో పబ్బులతో పాటు నగర శివార్లలో భారీ పార్టీలు ప్లాన్ చేశారు. ఇందులో డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Also Read : న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసుల సరికొత్త ప్రయోగం.. ఇలా దొరికిపోతారంతే..

డ్రగ్స్ విక్రేతలు, పెడ్లర్స్ పై పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫీ సిటీగా చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా పకడ్బందీగా ప్లాన్ చేసింది. డ్రగ్స్ మూలాలను అంతమొందించే ప్రయత్నం చేస్తోంది. ఈసారి నూతన సంవత్సర వేడుకల్లో లిక్కర్ తో పాటు భారీగా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో డ్రగ్స్ అమ్మేవారితో పాటు వాటిని యూజ్ చేసే వారిని పట్టుకునేందుకు పోలీసులు కొత్త తరహాను ప్లాన్ చేశారు.

Also Read : అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ విక్రయం.. హైదరాబాద్‌లో కలకలం, విద్యార్థి అరెస్ట్