ఏపీలో 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బోల్తా : ప్రయాణికులకు గాయాలు

ఏపీలో రెండు వేర్వేరు చోట్ల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ప్రకాశం జిల్లా గుడిపాడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు డివైడర్ ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.
అటు కృష్ణా జిల్లా నవాబు పేట దగ్గర మరో ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30మంది గాయపడ్డారు. వారిలో 10మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని నందిగామ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ బస్సు కింద ఇరుక్కుపోయాడు.