అంబర్‌పేటలో మహిళ హత్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. అంబర్‌పేటలో ఓ మహిళ దారుణ హత్య గావించబడింది.

హైదరాబాద్ లో దారుణం జరిగింది. అంబర్‌పేటలో ఓ మహిళ దారుణ హత్య గావించబడింది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. అంబర్‌పేటలో ఓ మహిళ దారుణ హత్య గావించబడింది. శుక్రవారం (అక్టోబర్ 11, 2019) ఈ ఘటన చోటు చేసుకుంది. ఆజాద్‌నగర్‌లో ఓ ముస్లిం మహిళ నివాసముంటోంది. ఆమెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి వయసు 23 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ కలహాల వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.