Karnataka Polls: బీజేపీ శైలికి వ్యతిరేకంగా యడియూరప్ప హాట్ కామెంట్స్.. వాటికి వ్యతిరేకమంటూ స్టేట్మెంట్

ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెళ్లకపోవడంపై యడియూరప్ప స్పందిస్తూ ‘‘నేను క్రైస్తవ, ముస్లిం కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. ఇతర సమాజ ప్రజలతో కూడా మమేకం కావాలి. నిజానికి బొమ్మై కూడా వెళ్ళేవారు. అటువంటి కార్యక్రమాలకు మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి’’ అని అన్నారు.

Karnataka Polls: బీజేపీ శైలికి వ్యతిరేకంగా యడియూరప్ప హాట్ కామెంట్స్.. వాటికి వ్యతిరేకమంటూ స్టేట్మెంట్

BS Yediyurappa

Karnataka Polls: కర్ణాటక రాష్ట్రంలో రేగిన హిజాబ్ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వివాదానికి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బహిరంగంగానే పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. దీనితో పాటు రాష్ట్రంలో మతం ఆధారంగా అనేక విషయాలు కాంట్రవర్సీగా మారాయి. వీటిన్నిటీలో బీజేపీ నేతలు ప్రత్యక్షంగానే ప్రమేయమై ఉన్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యవహారశైలికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Karnataka elections 2023: అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

హిజాబ్, హలాల్ లాంటి వివాదాలు అనవసరమని, వాటికి తాను పూర్తి వ్యతిరేకమని అన్నారు. అంతే కాదు, హిందువులు, ముస్లింలు సామరస్యంగా జీవించాలని తాను ముందు నుంచి ఈ స్టాండ్ మీదే ఉన్నానని ఆయన కుండబద్దలు కొట్టారు వచ్చే నెల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ జరగనుంది. దీనికి యడ్డీ ఇలా వ్యాఖ్యానించడం మరింత హాట్ హాట్‭గా మారింది. తాజాగా ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘నేను అలాంటి వాటికి (హిజాబ్, హలాల్ వంటి వివాదాలు) మద్దతు ఇవ్వను. నేను మొదట్లోనే ఈ స్టాండ్ తీసుకున్నాను. ఇవి అవసరం లేని సమస్యలు’’ అని అన్నారు.

Delhi Liquor Scam: తాను అవినీతిపరుడైతే లోకంలో నిజాయిపరులే ఉండరట.. కేజ్రీవాల్ చిత్రమైన వ్యాఖ్యలు

ఇక ఆహ్వానం అందినప్పటికీ చర్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెళ్లకపోవడంపై యడియూరప్ప స్పందిస్తూ ‘‘నేను క్రైస్తవ, ముస్లిం కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. ఇతర సమాజ ప్రజలతో కూడా మమేకం కావాలి. నిజానికి బొమ్మై కూడా వెళ్ళేవారు. అటువంటి కార్యక్రమాలకు మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి’’ అని అన్నారు. ఇక రాష్ట్రంలో సొంత పార్టీలో పెరుగుతున్న తిరుగుబాట్లపై యడియూరప్ప అంత సీరియస్ తీసుకున్నట్లుగా లేరు. అలాంటి పార్టీపై ప్రభావం చూపవని ఆయన అన్నారు. అయితే కొన్ని చోట్ల ఆ ప్రభావం ఉండొచ్చని, కానీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి నష్టం చేసేంత ఉండదని యడ్డీ అన్నారు.

Ambedkar statue: అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నాకు ఆహ్వానం రాలేదు: గవర్నర్ తమిళిసై

కర్ణాటకలోని కళాశాల ప్రాంగణంలో హిజాబ్ ధరించడం పట్ల రేగిన వివాదంపై విద్యార్థులపై బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్నా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం అయ్యాయి. క్రమంగా ఆ విషయం సుప్రీం కోర్టుకు వరకూ వెళ్లింది. ఇక గత సంవత్సరం, ఉగాడి (కర్ణాటక న్యూ ఇయర్ ఫెస్టివల్) సందర్భంగా ముస్లిం దుకాణదారులను ఆలయం సమీపంలో నుంచి తొలగించాలని, హలాల్ మాంసాన్ని హిందువులు బహిష్కరించాలని రైట్ వింగ్ సమూహాలు పిలుపునిచ్చాయి. అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవితో సహా పార్టీ నేతలు “ఎకనామిక్ జిహాద్” అంటూ కామెంట్లు చేశారు. మైనారిటీలపై విధ్వేషాలను రగిలిస్లూ మెజారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చేస్తున్న విభజన రాజకీయాలివంటూ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

Bihar : మద్యపాన నిషేధం ఉన్న బీహార్ లో.. కల్తీ మద్యం తాగి 8 మంది మృతి

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.