Health Tips: లైంగిక శక్తిని పెంచే అద్భుతమైన ఆహారం.. రోజు తీసుకుంటే మంచి ఫలితాలు
Health Tips: లైగిక శక్తిని పెంచే ముఖ్యమైన ఆహార పదార్థాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Amazing food that increases sexual potency in men
ప్రెజెంట్ జనరేషన్ లో జీవితం అనేది ఉరుకులు పరుగులుగా మారిపోయింది. దాని కారణంగా చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా దీని ప్రభావం లైంగిక శక్తిపై తీవ్రంగా పడుతోంది. లైంగిక శక్తి (Sexual Power) అనేది శారీరక సామర్థ్యం, హార్మోన్ల సంతులనం, మానసిక స్థితి, శృంగార ఆకాంక్ష మిళితంగా ఉంటుంది. ఈ శక్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి ఇప్పుడు లైగిక శక్తిని పెంచే ముఖ్యమైన ఆహార పదార్థాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లైంగిక శక్తిని దెబ్బతీసే అంశాలు:
- ఒత్తిడి, నిద్రలేమి
- టెస్టోస్టెరోన్ తగ్గుదల
- పోషకాహార లోపాలు
- ఆల్కహాల్, పొగతాగడం
- డిప్రెషన్, డయాబెటిస్, హై బీపీ
లైంగిక శక్తిని పెంచే అద్భుతమైన ఆహారాలు:
1.బాదం, వాల్‌నట్స్, పిస్తా:
వీటిలో ఎల్లోఅర్జినైన్ అనే యామినో యాసిడ్ ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. రోజుకు 5 నుంచి 6 బాదం, 2 వాల్‌నట్స్, 4 పిస్తా తింటే మంచి ఫలితాలు అందుతాయి.
2.గుడ్లు (Eggs):
గుడ్లలో ప్రోటీన్, విటమిన్ B6 అధికంగా ఉంటుంది. ఇది నర్వ్ సిస్టమ్ బలోపేతం చేసి హార్మోన్ల బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల బలమైన స్టామినా, మెంటల్ క్లారిటీ ఏర్పడుతుంది.
3.పాలకూర, మెంతి, కోసు కూర (Green Leafy Vegetables):
ఆకుకూరల్లో ఐరన్, నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తప్రసరణను పెంచుతాయి. ఇవి లైంగిక అవయవాలకి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.
4.డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ సెరటొనిన్, డోపమిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మూడ్ పెరగడం ద్వారా లైబిడో (libido) పెరుగుతుంది. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. రోజుకి 1 నుంచి 2 చిన్న ముక్కల కంటే ఎక్కువగా తీసుకోవాలి.
5.అరటిపండు (Banana):
అరటిపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
6.సాల్మన్, ట్యూనా, మాక్రెల్ ఫిష్:
ఈ చేపలలో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ సంతులనం చేస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని, మూడ్‌ను మెరుగుపరుస్తుంది.
7.వెల్లుల్లి (Garlic):
వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. దీనివల్ల పురుషులలో ఎరెక్షన్ మెరుగవుతుంది. ఖాళీ కడుపుతో 1 నుంచి 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే చాలా మంచిది.
8.తేనె (Honey):
తేనెలో బోరాన్ అనే ఖనిజం అధికంగా ఉంటుంది. దీనివల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే శక్తిని పెంచుతుంది, శరీర ఉత్సాహాన్ని మెరుగుపరుస్తుంది
9.సీజం, నువ్వులు:
వీటిలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ స్రవణాన్ని పెంచుతుంది. ఇది పురుషుల ఫెర్టిలిటీ సామర్ధ్యాన్ని పెంచుతుంది.
సహజ లైంగిక శక్తిని పెంచే పానీయాలు:
- అల్లం-తేనె టీ
- దాల్చిన చెక్క నీరు
- అశ్వగంధా లెహ్యం / కషాయం
- మకా పౌడర్ కలిపిన మిల్క్
జీవనశైలి మార్పులు:
- రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర చాలా అవసరం
- మద్యం, పొగతాగడం, Junk Food తినడం తగ్గించాలి
- రోజూ కనీసం 30 నిమిషాల వాకింగ్, యోగా, వ్యాయామం చేయాలి
లైంగిక ఆరోగ్యాన్ని సూచించే హార్మోన్లు:
టెస్టోస్టెరాన్: పురుషుల శృంగార శక్తిని పెంచుతుంది
ఎస్ట్రోజన్: మహిళల లైబిడోకి కీలకం
డోపమిన్, సెరటొనిన్: మానసిక ఉత్సాహం, ఆనందం పెంపునకు సహాయపడుతుంది.