అల్లం అంటే ముఖం చిట్లించుకోవద్దు… 8 ప్రయోజనాలు ఇవే

అల్లం రసం ఉదయం పరగడుపున తాగడం వలన ఏలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం...

అల్లం అంటే ముఖం చిట్లించుకోవద్దు… 8 ప్రయోజనాలు ఇవే

Updated On : February 14, 2025 / 5:55 PM IST

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడల్లా మెడిసిన్ తీసుకునే బదులుగా మన కిచెన్‌లో ఉన్న సహజ ఔషధాలను ఉపయోగించి ఉపశమనం పొందుతాము. అలాగే మనం రెగ్యులర్ గా కూర లో ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఓ గిన్నె లో ఒక గ్లాసు నీళ్లు, ఒక అర అంగుళం అల్లం ముక్క వేసి కాసేపు స్టవ్​ మీద మరిగించుకోవాలి.. బాగా ఉడికిన తరువాత వడపోసి..అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ఉదయం పరగడుపున తాగడం వలన ఏలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

1) రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి: అల్లం రసం తాగడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయవచ్చు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు అల్లం రసాన్ని తీసుకుంటే, ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరచుకోవచ్చు.

2) మెదడుకు ఉత్తేజం కలుగుతుంది: అతి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అల్లంలో కలిగి ఉండడం వల్ల నాడీ వ్యవస్థను ఉత్తేజపరచి, మేధస్సును పదునుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మతిమరుపు, మానసిక అలసట తగ్గుతాయి.

3) వయస్సు మళ్లిన వారిలో వచ్చే అల్జీమర్స్, మెంటల్ డిజార్డర్స్ తగ్గుతాయి: వయస్సు పెరిగే కొద్దీ అల్జీమర్స్ వంటి నాడీ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల అల్లం రసంలో ఉన్న యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు కణాలను రక్షించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. (చదవండి: బయట సమ్మర్ వాయించేస్తుంది.. బాడీ కూల్ గా ఉంచడానికి ఇలా చేయండి.. )

4) క్యాన్సర్ వచ్చే అవకాశాలు నివారించబడతాయి: అల్లం రసంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-క్యాన్సర్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను తొలగించి, క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా అడ్డుపడతాయి.

5) జీర్ణ సంబంధ వ్యాధులకు చక్కని పరిష్కారం లభిస్తుంది: అల్లం రసం జీర్ణ క్రియను మెరుగుపరిచి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా పెప్సిన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచి మనం తిన్న ఫుడ్ ని ఫాస్ట్ గా జీర్ణమయ్యేలా చేస్తుంది.

6) వికారం, అసిడిటీ, అజీర్ణం, దగ్గు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి: మలేరియా, డెంగీ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే, ప్రయాణాల్లో వికారం అనిపించినప్పుడు అల్లం రసం తాగితే వెంటనే ఉపశమనం పొందొచ్చు. దగ్గు, గొంతు నొప్పి, అసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

7) శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: అల్లం రసం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.

8) కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి: అల్లం రసాన్ని రోజూ తాగితే ఆర్థరైటిస్, కండరాల నొప్పి తగ్గును అలాగే కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇంతకుముందు చెప్పినట్లు అల్లం రసం శరీర ఆరోగ్యానికి అపూర్వమైన ఔషధంగా పని చేస్తుంది. రోజుకు ఒక గ్లాస్ అల్లం రసం తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. అయితే, అధిక పరిమాణంలో తీసుకుంటే హాని కలుగవచ్చును.

Disclaimer: ఇందులో ఉన్న విషయాలను మేము ధ్రువీకరించలేదు.. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి, అవగాహన కోసమే ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేశాము.