విస్తారంగా వర్షాలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు పంటలు నీల పాలయ్యాయి. హైదరాబాద్‌లో కూడా జనవరి 27వ తేదీ ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు చల్లటి వాతావరణం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవగా..కొన్ని ప్రాంతాల్లో మోస్తారుపాటి వర్షం కురిసింది.