కాళేశ్వరం ఫైట్ : మండలిలో జీవన్ రెడ్డి Vs హరీష్ రావు

  • Published By: madhu ,Published On : September 14, 2019 / 12:44 PM IST
కాళేశ్వరం ఫైట్ : మండలిలో జీవన్ రెడ్డి Vs హరీష్ రావు

Updated On : September 14, 2019 / 12:44 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనమండలిలో హాట్ హాట్ చర్చలు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాలేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు రాలేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రం చెబుతోంది నిజమా ? రాష్ట్రం చెబుతోంది నిజమా ? అంటూ ప్రశ్నించారు. నష్టపోయేది తెలంగాణ రాష్ట్రం, ప్రజలు అన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందో కాక..ప్రస్తుతం ఏమి చేయాలనే దానిపై దృష్టి సారించాలని సూచించారు. 

మంత్రి హరీష్ రావు సమాధానం : –
స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసి..అన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేయడం జరిగిందని మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడం జరిగిందన్నారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడానికి కారణం కాంగ్రేస్సేనంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసులు వేసినట్లు..వారి పేర్లను గతంలోనే తాను సభలో వెల్లడించినట్లు గుర్తు చేశారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి..ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదాను విస్మరించారని విమర్శించారు. ప్రాణహితను రీ డిజైన్ చేసి..ప్రాజెక్టులు కడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత నివ్వకుండా..రాజకీయ ప్రయోజనాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు.