బీజేపీ నేతలది రాజకీయ హిందుత్వం : కేటీఆర్
బీజేపీ నేతలకు ఐదేళ్లకొకసారి దేవుడు, రాముడు గుర్తొస్తాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

బీజేపీ నేతలకు ఐదేళ్లకొకసారి దేవుడు, రాముడు గుర్తొస్తాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
బీజేపీ నేతలకు ఐదేళ్లకొకసారి దేవుడు, రాముడు గుర్తొస్తాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీ, నరేంద్రమోడీ దేవుడిని తలుచుకుంటారని…కానీ తాము రోజూ దేవుడిని నమ్ముతామని చెప్పారు. బీజేపీ నేతలది రాజకీయ హిందుత్వమని విమర్శించారు కేటీఆర్. ఏప్రిల్ 6 శనివారం కూకట్ పల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన మైనార్టీల సభలో ఆయన ప్రసంగించారు.
కేసీఆర్ యాగాలు, యజ్ఞాలు చేస్తే, దేవుడికి మొక్కితే తప్పేంటని, మోడీకి ఏం బాధని ప్రశ్నించారు. ఇష్టముంటే మోడీ కూడా యాగాలలో పాల్గొనాలని సూచించారు. ప్రధాని స్థాయికి తగ్గ మాటలు మాట్లాడటం లేదని మండిపడ్డారు. కేసీఆర్ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also : మేనిఫెస్టోలో కీలక అంశాలు చెప్పిన చంద్రబాబు
తెలంగాణలో హిందూ..ముస్లీంలు అన్నదమ్ముల్లా జీవిస్తున్నారని తెలిపారు. ఓట్ల వారి మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి మాటల్లో కాదు..చేతల్లో చూపించాలన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మోడీని తిప్పికొట్టాలన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు.
కారు..సారు..పదహారు..ఢిల్లీలో సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్లాలని చెప్పారు. ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ సాధించారని… 16 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి ఏదైనా తెచ్చుకోవచ్చన్నారు. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఫలితాలే లోక్ సభ ఎన్నికల్లో పునరావృతం అవుతాయన్నారు.
Read Also : కాంగ్రెస్ గూటికి చేరిన బీజేపీ రెబల్ లీడర్