Siti Hawa Hussin : ఓ మైగాడ్.. 112 ఏళ్ల బామ్మకు వరుడు కావాలట.. ఎవరైనా ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసుకుంటానంటోంది

ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదు అంటారు. 112 ఏళ్ల వయసులో ఓ బామ్మగారికి పెళ్లి చేసుకోవాలని ఉందట. ఎవరైనా ప్రపోజ్ చేస్తే అందుకు సిద్ధమని చెబుతోంది.

Siti Hawa Hussin : ఓ మైగాడ్.. 112 ఏళ్ల బామ్మకు వరుడు కావాలట.. ఎవరైనా ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసుకుంటానంటోంది

Siti Hawa Hussin

Updated On : January 12, 2024 / 6:50 PM IST

Siti Hawa Hussin : 112 ఏళ్ల వయసులో ఓ బామ్మ తోడు కోరుకుంటోంది. ఇప్పటికే 7 ఏడుసార్లు పెళ్లి చేసుకుని మునిమనమల్ని ఎత్తినా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటోంది. ఆశ్చర్యపోతున్నారా?  సితి హవా హుస్సేన్ అనే మలేషియా బామ్మ గురించి చదవండి.

zomato Food Delivery Boy : గుర్రంపై ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్.. రూ.10వేల సహాయం చేసిన ఎంబీటీ ప్రతినిధి.. వీడియో వైరల్

100 సంవత్సరాలు బ్రతకడమే వండర్ అనుకుంటే మలేషియాకు చెందిన సితి హవా హుస్సేన్ అనే మహిళకు 112. అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడమే అద్భుతం అని చెప్పాలి. ఈ బామ్మ ఏడుగురిని పెళ్లాడిందట. వారంతా చనిపోగా..ఐదుగురు పిల్లలు, 19 మంది మనవలు.. 30 మంది మనవరాళ్లు ఉన్నారు. ఈ బామ్మ తోబుట్టువులు, స్నేహితులు అంతా చనిపోయారట. కుటుంబ సభ్యులు అంతమంది ఉన్నా. ఈ వయసులో బీపీ మందులు వాడుతున్నా ఆరోగ్యంగా ఉంది సితి హవా హుస్సేన్.

సితి హవా హుస్సేన్ కర్ర సాయం అవసరం లేకుండా ఇప్పటికీ ఆరోగ్యంగా నడవగలదట..వయసు రీత్యా కొద్దిగా వినికిడి లోపం.. కాస్త కంటిచూపు మందగించినా తను ఇంతకాలం ఆరోగ్యంగా జీవించడానికి రహస్యం అంటూ ఏమీ లేదని ఈ బామ్మ చెబుతోంది. రోజంతా బెడ్ పై పడుకోవడం.. దేవుని ప్రార్థనలు చేయడం ఈ బామ్మ దినచర్యనట. 47 సంవత్సరాల ఈ బామ్మ కోడలు జైనురా ఆరిఫిన్ తన అత్తగారి ఆరోగ్యం గురించి అనేక విషయాలు వెల్లడించింది. వయసు పెరగడం వల్ల జ్ఞాపకశక్తి లోపించినప్పటికీ మనవలకు ఎన్నో చారిత్రక సంఘటనలు చెబుతూ ఉంటుందట.

Rajasthan : బుల్లెట్ బండికి గుడి కట్టిన ప్రజలు.. ఈ వింత గుడి విశిష్టత ఏంటో తెలుసా?

ప్రస్తుతం చిన్న కొడుకు, కోడలితో నివసిస్తున్న సితి హవా హుస్సేన్‌కు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందట. ఎవరైనా తనకు ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసుకుంటానని అంటూ ఉంటుందట. బహుశా ఈ మాటలు ఆ బామ్మగారు సరదాగా అని ఉండొచ్చు. సోషల్ మీడియాలో మాత్రం ఈ రకంగా సితి హవా హుస్సేన్  వైరల్ అవుతోంది.