కరోనాకు తోడు భూమిపైకి 4 గ్రహశకలాలు దూసుకొస్తున్నాయి : NASA

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వేలాదిమంది ప్రాణాలు తీసేస్తోంది. లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదువుతున్నాయి. మందులేని కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్న తరుణంలో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాప్తితో ప్రాణాలు చేతుల్లో పట్టుకుని భూమిమీద జీవిస్తున్న మానవాళీకి మరో ముప్పు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఒకపక్క కరోనా Covid-19 విజృంభిస్తుంటే.. భూమిపైకి నాలుగు గ్రహశకలాలు దూసుకొస్తున్నట్టు నాసా చెబుతోంది. NASAకు చెందిన నీయర్ ఎర్త్ అబ్జెక్ట్ స్టడీస్ లేదా CNEOS ప్రకారం.. మార్చి 21, మార్చి 23న భూమి మీదకు నాలుగు గ్రహ శకలాలు వస్తున్నట్టు రిపోర్టు తెలిపింది. ఈ నాలుగు ఆస్ట్రాయిడ్స్ భూమికి అతిదగ్గరగా వచ్చే అవకాశం ఉందని నాసా అంచనా వేస్తోంది.
CNEOS.. ఈ నాలుగు గ్రహశకలాలకు 2020 FK, 2020 FS, 2020 DP4, 2020 FFI అనే పేర్లను పెట్టింది. ఇందులో FK అనే గ్రహశకలం చాలా చిన్నదిగా పేర్కొంది. ఇది కనీసం డయామీటర్‌లో 43 అడుగుల వరకు ఉంటుంది. నాలుగు గ్రహ శకలాలు మన భూగ్రహానికి గంటకు 37,000 కిలోమీటర్ల వేగంతో 1.36 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో దూసుకొస్తున్నట్టు నాసా వెల్లడించింది.
2020 FS, కొద్దిగా పెద్దశకలం.. దీని వ్యాసం 56 అడుగుల వరకు ఉంటుంది. గంటకు 15,000 కిలోమీటర్ల తక్కువ వేగంతో ప్రయాణిస్తోంది. భూమికి 3.05 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ శకలం ప్రయాణించనుంది. ఇక 2020 FK గ్రహ శకలం భూగ్రహానికి భారత కాలమానం ప్రకారం.. ఉదయం 9.35 (IST)సమయానికి దగ్గరగా రానుంది. అదేవిధంగా 2020 FS గ్రహ శకలం కూడా రాత్రి 8.59 సమయంలో భూమికి దగ్గరగా ప్రయాణించనుంది.
మార్చి 23న 2020 DP4 గ్రహశకలాన్ని భూమికి దగ్గరగా రావడాన్ని చూడవచ్చు. ఈ నలుగు గ్రహశకలాల్లో కంటే దీని వ్యాసం 180 అడుగుల వరకు అతిపెద్దగా ఉంటుంది. భూమికి 1.35 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో గంటకు 29,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ నాలుగు గ్రహశకలాలు భూమికి చాలా మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనున్నాయి. ఈ గ్రహశకలాలతో భూగ్రహానికి ఎలాంటి ముప్పు లేదని నాసో చెబుతోంది. దీనిపై ఎవరూ పెద్దగా భయపడాల్సిన పనిలేదు.