ఈశాన్య ఆస్ట్రేలియాలో వరదలు

సిడ్నీ : వరదలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో వరదల ధాటికి జనజీవనం స్తంభించిపోతోంది. వీధులన్నీ వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోని టౌన్స్ విల్ నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. కనీసం రాకపోకలకు కూడా వీలు లేకపోవడంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టౌన్స్ విల్‌కు ఉత్తరం ఉన్న ఇంగ్హామ్ పట్టణంలో 506 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఏ పాటి వరద ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సైన్యం మోహరించి పరిస్థితిని సమీక్షిస్తోంది.