1978లో సీతారామ లక్ష్మణ విగ్రహాలు చోరీ : 40 ఏళ్లకు భారత్ కు అప్పగించిన బ్రిటన్

  • Published By: nagamani ,Published On : November 19, 2020 / 12:22 PM IST
1978లో సీతారామ లక్ష్మణ విగ్రహాలు చోరీ : 40 ఏళ్లకు భారత్ కు అప్పగించిన బ్రిటన్

Updated On : November 19, 2020 / 12:53 PM IST

Britain returns stolen sculptures of Lord Ram, Sita Lakshman : భారతదేశంలో 13వ శతాబ్ద కాలంనాటి పురాతన కాలంనాటి సీతారామ లక్ష్మణ విగ్రహాలు 1978లో చోరీకి గురయ్యాయి. ఆ విగ్రహాలు యునైటెడ్ కింగ్ డమ్ దేశాల్లోని బ్రిటన్ కు తరలిపోయాయి. ఈ అరుదైన సీతారాముల విగ్రహాలను బ్రిటన్ ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించి తిరిగి భారత్ కు అప్పగించింది.



ఆ విగ్రహాలు తమిళనాడుకు చేరుకున్నాయి. సెప్టెంబరు 15న లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో వీటిని అప్పగించగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఢిల్లీలో నిన్న భారత పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.



https://10tv.in/tirumala-hundi-income-increases/
వివరాల్లోకి వెళితే..1978 అంటే 40 ఏళ్ల క్రితం 13వ శతాబ్దంనాటి పురాతన సీతారామలక్ష్మణుల కాంస్య విగ్రహాలు చోరీకి గురయ్యాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా ఆనందమంగళంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన శ్రీ రాజగోపాల్ విష్ణు ఆలయం నుంచి ఈ విగ్రహాలు చోరీ అయ్యాయి. ఇవి లండన్‌కు తరలిపోయి ఉండొచ్చని అనుమానించిన ఇండియా ప్రైడ్ ప్రాజెక్టు అధికారులు గతేడాది ఆగస్టులో లండన్‌లోని భారత దౌత్యకార్యాలయానికి సమాచారం చేరవేశారు.


1958లో ఈ విగ్రహాలకు తీసిన ఫొటో ఒకటి భద్రంగా ఉండడంతో చోరీ అయిన విగ్రహాలను వెతికి పట్టుకోవడం సులభమైంది. 1978 నవంబరు 23, 24 తేదీల్లో ఈ విగ్రహాలు చోరీ అయినట్టు గుర్తించిన తమిళనాడు పోలీసులు దొంగలను కూడా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను భారత అధికారులు లండన్ పోలీసులకు అందజేయడంతో వారు దర్యాప్తు చేపట్టి విగ్రహాల యజమానిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత నెల 15న వాటిని లండన్‌లోని భారత దౌత్య కార్యాలయంలో అధికారులకు అప్పగించారు. ఫలితంగా ఇవి తిరిగి ఇండియాకు చేరుకున్నాయి.


సెప్టెంబరు 15న లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో సీతారాముల విగ్రహాలను అప్పగించగా..కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఢిల్లీలో బుధవారం (నవంబర్ 18,2020) భారత పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.