Indonesia Bus Crash: బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో 15 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు.. రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మృతి చెందగా..మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Indonesia Bus Crash: బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో 15 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు

Indonesia Bus Crash

Updated On : May 16, 2022 / 5:56 PM IST

Indonesia Bus Crash: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు.. రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మృతి చెందగా..మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇండోనేసియాలోని మోజోకెర్టో జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి డైవర్‌ నిద్రమత్తే కారణమని అధికారులు చెబుతున్నారు. బస్సులోని ప్రయాణికులంతా సురబాయకు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా..మధ్యజావాలోని ప్రముఖ పర్వత ప్రాంతమైన డీంగ్‌ పీఠభూమికి విహారయాత్రకు వెళ్లి తిరిగిస్తుండగా..ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Indonesia crocodile : మొనగాడొచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో టైర్ తీసాడు..రూ.కోట్ల బహుమతిని ఏంచేశాడంటే..
ఈ రోడ్డు యాక్సిడెంట్‌లో అక్కడిక్కడే 10 మంది మరణించారు.. మిగిలిన వారిని ఆస్పత్తికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో 16 మందికి తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న నాలుగు ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Indonesian School : విద్యార్థుల ఫోన్లను మంటల్లో పారేసిన టీచర్లు.. షాకింగ్ వీడియో

మరోవైపు తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌.. కోలుకున్న తర్వాత అసలు విషయం తెలుస్తుందని సెర్చ్‌ అండ్‌ రెస్య్కూ అధికారి జిన్హువా.. వార్తా సంస్థకు తెలిపారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.