త్యాగాలు చెయ్యక తప్పదట: కరోనా రోగికి 80 ఏళ్లు దాటితే నో ట్రీట్మెంట్!

  • Published By: vamsi ,Published On : March 16, 2020 / 07:12 PM IST
త్యాగాలు చెయ్యక తప్పదట: కరోనా రోగికి 80 ఏళ్లు దాటితే నో ట్రీట్మెంట్!

Updated On : March 16, 2020 / 7:12 PM IST

కోవిడ్-19.. కరోనావైరస్.. పేరేదైనా ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాను అతలాకుతలం చేసిన ఈ వైరస్.. ఇటలీని కూడా ఇబ్బంది పెడుతుంది. అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు దెబ్బకి కరోనా జన్మస్థలం చైనా తర్వాత ఇటలీనే గడ్డు పరిస్థితి ఏదుర్కొంటుంది. అత్యంత ఉన్నత జీవన ప్రమాణాలకు విలువనిచ్చే ఇటలీ చిగురుటాకులా వణికిపోతున్నది.

కొత్త కేసులు, మరణాలు.. దేశంలోని వైద్యసౌకర్యాలు చాలట్లేదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు తక్కువ ఉండడంతో ఎవరిని చేర్చుకోవాలి..? ఎవరిని వదిలేయాలి..? అనే ఇబ్బందులు ఏదుర్కోంటుంది అక్కడి ప్రభుత్వం. పర్యాటకరంగ ప్రాంతం కావడంతో ఇటలీలో వ్యాధి వ్యాప్తి విపరీతంగా సాగుతుంది. ఈ సమయంలోనే ఇటలీలో ప్రభుత్వం ముందు ఓ చిక్కు ప్రశ్న వచ్చి పడింది.

అందరినీ బతికించాలనే ప్రభుత్వాలకు ఉంటాయి. కానీ అందుకు తగ్గ పరిస్థితి అక్కడ లేనప్పుడు ఏం చేస్తారు. ఇప్పడు ఇటలీ పరిస్థితి కూడా అదే. అనివార్యంగా కొందరిని వదులుకోక తప్పదు.. అయితే వారు ఎవరు..? బతకాల్సింది ఎవరు..? చనిపోవాల్సింది ఎవరు..?  ఇప్పుడు ఇటలీలో ఎవరు బతకాలి..? ఎవరు చావాలి..? ఎవరు చచ్చిపోయినా పర్లేదు… ఎవరిని కచ్చితంగా బతికించుకోవాలి అనే విషయాలపై ఆలోచనలు జరుపుతుంది. 

ప్రొటోకాల్ ప్రకారం 80 ఏళ్లు పైబడిన వృద్దులకు కరోనా సోకితే, ఇంటెన్సివ్ కేర్‌లోకి చేర్చుకోకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కరోనా కారణంగా చనిపోతున్నవారిలో ఎక్కువ మంది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లే. అయితే ఆ దేశంలో ఉన్న జనాభాలో వృద్ధులే 22 శాతం పైగా ఉండగా.. వీరిని అందరినీ చేర్చుకుంటే దేశంలో ఉన్న 5 వేల ఇంటెన్సివ్ కేర్ బెడ్స్, ప్రైవేటు క్లినిక్కులు, టెంట్లలో కొత్తగా సౌకర్యాలు ఏర్పాటు చేసినా, సరిపడా డాక్టర్లు లేరు, మందులు లేవు… ఇప్పటికే దాదాపు 25 వేల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆ దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.