Bennett And Modi : మోదీకి ఆఫర్..పార్టీలో చేరండి

స్కాట్లాండ్‌లో జరుగుతున్న కాప్‌26 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో భాగంగా మోదీ పలువురు దేశాధినేతలు, వివిధ రంగాల అధిపతులతో భేటీ అయ్యారు.

Bennett And Modi : మోదీకి ఆఫర్..పార్టీలో చేరండి

Modi And Bennett

Updated On : November 3, 2021 / 12:01 PM IST

Join My Party : రాజకీయాల్లో ఆయనకు ఆయనే పోటీ..! క్రేజ్‌లో ఆయనకు ఆయనే సాటి..! పాతాళంలో ఉన్న పార్టీని ఒంటిచెత్తో అధికారంలోకి తెచ్చిన లీడర్‌ ప్రధాని మోదీ. ఇదంతా ఆయనకున్న క్రేజ్‌తోనే సాధ్యమైంది. ఇదంతా ఆయన ఛరిష్మానే..! ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న రాజకీయ నాయకులకు వివిధ పార్టీల నుంచి ఆఫర్లు రావడం షరా మాములే..! అయితే మోదీకి కూడా ఒక పార్టీ నుంచి ఆఫర్‌ వచ్చింది. అది కూడా మనదేశంలో పుట్టిన పార్టీ నుంచి కాదు..! ఆయన ఇజ్రాయెల్‌ వస్తున్నారంటే చాలు అక్కడి ప్రజలకు సొంత మనిషి వస్తున్నారనే ఫిలింగ్..! మోదీ తమ నాయకుడే అన్న భావన..! మోదీ మనోడేనన్న ఆలోచన..! ఇప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెఫ్టాలీ బెనెట్‌ మోదీతో చెప్పారు.

Read More : Naga Shaurya’s Father : గుత్తా సుమన్ మాములోడు కాదు.. పీఎస్‌కు రానున్న హీరో నాగశౌర్య తండ్రి

స్కాట్లాండ్‌లో జరుగుతున్న కాప్‌26 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో భాగంగా మోదీ పలువురు దేశాధినేతలు, వివిధ రంగాల అధిపతులతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెన్నెట్‌తోనూ మోదీ సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీతో బెన్నెట్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు ప్రధానులు చర్చించారు.
ముఖ్యంగా అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవసాయం, అంతరిక్షం, భద్రత విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.

Read More : Deepotsav : అయోధ్య జిగేల్, ప్రపంచ రికార్డు

ఇండో-ఇజ్రాయెల్‌ సంబంధాలను తిరిగి ప్రారంభించడం పట్ల మోదీకి బెనెట్ ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఇంతకుముందు కొనసాగించినట్లుగానే భారత్‌ తన సహకారాన్ని అందించాలని ఆకాంక్షించిన బెనెట్.. వివిధ రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలని కోరారు. ఇక భేటీ మొదలవడానికి ముందు బెనెట్‌, మోదీల మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌లో అత్యంత పాపులర్‌ వ్యక్తి మీరేనని.. వచ్చి మా పార్టీలో చేరండింటూ బెన్నెట్‌ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి మోదీ గట్టిగా నవ్వుతూ అభినందనలను స్వీకరించారు.