Pfizer Delta Variant Vaccine : గుడ్‌న్యూస్, డెల్టా వేరియంట్ వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ను తయారు చేసిన ఫైజర్

డెల్టా వేరియంట్.. కరోనా కొత్త రూపాల్లో ఇదీ ఒకటి. మిగతా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారింది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు విస్తరించింది.

Pfizer Delta Variant Vaccine : గుడ్‌న్యూస్, డెల్టా వేరియంట్ వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ను తయారు చేసిన ఫైజర్

Pfizer Delta Variant Vaccine

Updated On : August 6, 2021 / 1:17 PM IST

Pfizer Delta Variant Vaccine : డెల్టా వేరియంట్.. కరోనా కొత్త రూపాల్లో ఇదీ ఒకటి. మిగతా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారింది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు విస్తరించింది. ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. వీటిలో చాలావరకు డెల్టా వేరియంట్ కేసులు ఉంటున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ఫార్మా దిగ్గజం ఫైజర్ గుడ్ న్యూస్ చెప్పింది. డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని ప్రకటించింది. ఆ వ్యాక్సిన్ కు అవసరమైన పదార్ధాలను అభివృద్ధి చేసింది.

కరోనావైరస్ వ్యాపిస్తున్న కొద్దీ దాని జెనిటిక్ కోడ్ కొత్త రూపాలు సంతరించుకుంటోంది. కరోనా కొత్త రూపాల్లో ఒకటి డెల్టా వేరియంట్. ఇది చాలా ప్రమాదకరంగా మారింది. డెల్టా వేరియంట్ కారణంగా అమెరికాలో 90శాతానికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ పై సమర్థవంతంగా పని చేస్తున్నాయని నిపుణులు తెలిపారు. తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా రక్షణ ఇస్తున్నాయని చెప్పారు. డెల్టా వేరియంట్ ను కట్టడి చేసేలా, వ్యాప్తిని నిరోధించేలా వ్యాక్సిన్ తయారు చేశారు. డెల్టా వేరియంట్ ను ఎదుర్కొనేలా తాము వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని ఫైజర్ ప్రకటించింది. క్లినికల్ ట్రయల్ కోసం ఎంఆర్ఎన్ఏ తొలి బ్యాచ్ ను తయారు చేశామంది. ఆగస్టులో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత త్వరలోనే ఫైజర్ అభివృద్ధి వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.