Road Accident : NRI రామచంద్రారెడ్డి కూతురు ‘అక్షితారెడ్డి’ మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ రామచంద్రారెడ్డి కూతురు అక్షితారెడ్డి ప్రాణాలు విడిచింది.. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచింది.

Road Accident : NRI రామచంద్రారెడ్డి కూతురు ‘అక్షితారెడ్డి’ మృతి

Road Accident

Updated On : December 27, 2021 / 5:23 PM IST

Road Accident : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అక్కాతమ్ముడు మృతి చెందారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ రామచంద్రారెడ్డి, రజని దంపతులు 20 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. వృత్తి రీత్యా వీళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు అక్షితారెడ్డి రెడ్డి పదకొండవ తరగతి చదువుతుండగా, కుమారుడు ఆర్జిత్‌రెడ్డి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 18వ తేదీన.. మిత్రుడి ఇంట్లో విందు ఉండగా కుటుంబ సభ్యులతో వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో,  ఫూటుగా మద్యం సేవించి కారు నడుపుతూ వచ్చిన మహిళ.. వీరు ప్రయాణిస్తున్న కారును ఓ మూలమలుపు వద్ద వెనుకనుంచి ఢీకొట్టింది.

చదవండి : America : వీసా జారీ అంశంలో అమెరికా కీలక నిర్ణయం.. వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు

ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డి కుమారుడు ఆర్జిత్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అక్షితారెడ్డి ఈ రోజు మృతి చెందింది. ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డి.. ఆయన భార్య రజనికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు పిల్లలను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణలోని రామచంద్రారెడ్డి సొంత గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చదవండి : Latin American Artist : అరుదైన పెయింటింగ్..చాలా కాస్ట్ గురూ