5 అడుగుల 6 అంగుళాల స్థలంలో 3 అంతస్థుల బంగ్లా..ధర రూ.10కోట్లు..

thinnest house in london up for sale for RS.10 Crores : ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన లండన్ మహానగరంలో ఓ ప్రత్యేక బంగ్లా అమ్మానికి వచ్చింది. ధర 3.1 మిలియన్లు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.10కోట్లు..కావాలంటే కొనుక్కోవచ్చు..ఈ బంగ్లాను బైటనుంచి చూస్తే ఇంత చిన్న ఇల్లు అంతే రేటా? అని ఆశ్చర్యపోవచ్చు.
మన దేశ రాజధాని ఢిల్లీలోని బురాడీలో 6 గజాల స్థలంలో నిర్మించిన మూడు మూడంతస్తుల భవనం ఎంత ఫేమస్ అయ్యిందో తెలుసుగా..కానీ అంతకంటే చిన్న ఇల్లు ఇది. ఇల్లు వెడల్పు కేవలం 5 అడుగుల 6 అంగుళాలు. అంత చిన్న స్థలంలో ఏకంగా మూడు అంతస్థుల ఇల్లు. అటూ ఇటూ రెండు పెద్ద భవనాల మధ్యలో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తుందీ బక్క పీచులా కనిపించే బంగ్లా. ఆ బక్క బంగ్లా ఇప్పుడు అమ్మాకానికి వచ్చింది.
ఆ దారిన వెళ్లే వాళ్లు కాస్తంత జాగ్రత్తగా గమనిస్తే గానీ అక్కడో బంగ్లా ఉన్నట్లే కనిపించదు. కాస్త పరిశీలనగా చూస్తేనే కనిపిస్తుంది. ఇదీ.. లండన్‌లోని ఈ బంగళా ప్రత్యేకత. ఈ భవనం అమ్మాకానికి రావటంతో ప్రపంచమంతా దాని గురించే మాట్లాడుకుంటోంది. లండన్‌లో అత్యంత సన్నగా ఉండే..ఈ బంగళా ఖరీదు దాదాపు రూ. 10 కోట్లు.
ఈ బంగ్లా కేవలం 5 అడుగుల 6 అంగుళాలండే ఈ బంగ్లా 19వ శతాబ్దం చివరిలో కట్టారని అంటారు. దీంట్లో మొదట టోపీలు అమ్మే షాపు ఉండేదట. ఓ ఫ్యామిలీ కూడా ఉండటానికి వీలుగాను..ముడిసరుకు స్టాక్ చేసుకోవటానికి కొంత స్థలం కూడా వీలుంది. బ్రిటన్‌కు చెందిన రియలెస్టేట్ సంస్థ వింక్ వర్త్ ఎస్టేట్ దీన్ని అమ్మకానికి పెట్టింది. ధర 1.3 మిలియన్ డాలర్లు(మనకరెన్సీలో దాదాపు 10 కోట్లు) అని ప్రకటించింది. అయితే..ఈ బంగళాకున్న ప్రత్యేకత రీత్యా ఈ ధర సరైందేనని వింక్‌వర్త రియలెస్టేట్ చాలా గట్టిగా చెబుతోంది.
ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వంటింల్లు మిగితా గదులన్నికంటే సన్నగా ఉంటుంది. అంటే వెడల్పు 5 అడుగుల 6 అంగుళాలు. ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్ రూం, స్టడీ రూం ఉండగా..సెకండ్ ఫ్లోర్ లో బాత్రూమ్, షవర్ థర్డ్ ఫ్లోర్ లో మాస్టర్ బెండ్ రూం ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వెళ్లటానికి స్పైరల్ స్టెప్స్ ఎక్కి వెళ్లాలి. అయితే.. యువ జంటలకు లేదా ఒకే వ్యక్తికి ఇది ఎంతో అనువుగా ఉంటుందని వింక్‌వర్త్ సంస్థ చెబుతోంది.
ఈ భవనం రేటు మాత్రం లండన్ వాసులకు షాకిస్తోంది. స్థానికంగా ఇంటి ధరలు సగటున 2.5 లక్షల పౌండ్లు ఉంటే ఈ సన్నిటి బంగళా ధర మాత్రం ఏకంగా 9.5 లక్షల పౌండ్లు. ఇటువంటి వింత ఆస్తుల పట్ల ఆసక్తిఉన్న కోటీస్వరులెవరైనా ఈ బంగాళను సొంతం చేసుకోవచ్చు. 2006లో ఈ బంగళా విలువ 4.8 లక్షల పౌండ్లు. అయితే..వింక్‌వర్త చెప్పిన ధరకు ఇది అమ్ముడైతే మాత్రం 14ఏళ్లలో దీని విలువ రెట్టింపైనట్లే లెక్క!!