Italy : ఆమె కొన్న 3 ఇళ్లు జస్ట్ రూ.270

ఇల్లు కొనాలంటే లక్షలు చేతిలో పట్టుకుంటే కానీ అయ్యే పని కాదు. కానీ ఓ మహిళ రూ.270 కే మూడు ఇళ్లు కొనేసింది. ఆ ఇళ్లను అందంగా మార్చే ప్రయత్నంలో ఉంది. ఆశ్చర్యపోతున్నారా? నిజమే.

Italy : ఆమె కొన్న 3 ఇళ్లు జస్ట్ రూ.270

Italy

Updated On : May 21, 2023 / 11:12 AM IST

3 Houses in Italy for just Rs.270 : మూడు ఇళ్లు రూ.270 మాత్రమేనా.. అని ఆశ్చర్యపోతున్నారు కదూ. నిజమే. ఇటలీలో ఓ మహిళ పాడుబడిన ఇళ్లను జస్ట్ రూ.270 కొనుగోలు చేసింది. అలా ఎలా సాధ్యమైంది? చదవండి.

Bengaluru : ట్రాఫిక్ జామ్‌లో కూడా బైక్ మీద కూర్చుని ల్యాప్ టాప్‌లో పని చేసుకుంటున్న మహిళ..

రూబియా డేనియల్స్ అనే 49 సంవత్సరాల మహిళ ఇటలీలోని సిసిలీలో కేవలం $3.30 (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.270) కు మూడు ఇళ్లు కొనుగోలు చేసింది. కాలిఫోర్నియాకు చెందిన ఈమె మూడురోజుల పాటు వెతికి పట్టుకుని మరీ ఈ ఇళ్లను కొనుగోలు చేసిందట. కోవిడ్ సమయంలో ఇటలీలో జనాభా బాగా తగ్గిపోయింది. సిసిలీలో పట్టణాన్ని మళ్లీ పునరుజ్జీవింపచేసే ప్రయత్నంలో $1 కంటే తక్కువ ధరకు ఇళ్లను విక్రయించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఇళ్లను కొనుగోలు చేసిన తిరిగి వాటికి రిపేర్లు చేయించుకోవాలంటే కనీసం రూ.20 నుంచి రూ.70 లక్షలు ఖర్చవుతుందట. ఇక్కడి రేట్ల గురించి ఎంక్వైరీ చేసుకున్న రూబియా చౌక ధరకు ఇళ్లను కొనుగోలు చేసింది.

UK Woman : ‘ఆ’ ఇంగ్లీషు అక్షరాలు తెచ్చిన తంటా .. మహిళా ఉద్యోగికి భారీ జరిమానా..!

రూబియా ఈ పాడుబడిన ఇళ్లను అందమైన ఇళ్లుగా మార్చేందుకు ప్రణాళికలు వేసిందట. ఒక తనకు గెస్ట్ హౌస్‌గా.. మరో ఇంటిని ఆర్ట్ గ్యాలరీలాగ.. మూడవ ఇంటిని వెల్నెస్ సెంటర్‌గా మార్చాలని అనుకుంటోందట. ఇంత ప్లాన్ ప్రకారం వెళ్తున్న రూబియా నిజంగా చాలా తెలివైన లేడీ.

 

View this post on Instagram

 

A post shared by In This Life (@inthislifepodcast)