Allu Arjun : నిర్మాత SKNని పరామర్శించిన అల్లు అర్జున్…
ఇటీవల నిర్మాత SKN ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. జనవరి 4న నిర్మాత SKN తండ్రి గాదె సూర్యప్రకాశరావు మరణించారు.

Allu Arjun Pays Tributes to Producer SKN Father Photos goes viral
Allu Arjun : ఎన్నో ఏళ్లుగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న నిర్మాత శ్రీనివాస కుమార్ అలియాస్ SKN. గత ఏడాది ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు SKN. అతని స్పీచ్ లతో కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. త్వరలో బాలీవుడ్ లో కూడా సినిమాలు తీయబోతున్నాడు. ఆల్రెడీ తన నిర్మాణ సంస్థ నుంచి మరో రెండు సినిమాలు ప్రకటించాడు.
Also Read : Republic Day Movies : రిపబ్లిక్ డేకి సినిమాల జాతర.. ఈ వారం థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
అయితే ఇటీవల నిర్మాత SKN ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. జనవరి 4న నిర్మాత SKN తండ్రి గాదె సూర్యప్రకాశరావు మరణించారు. ఆ సమయంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించి SKNని పరామర్శించారు. తాజాగా అల్లు అర్జున్ నేడు ఉదయం SKN ఇంటికి వెళ్లి ఆయన తండ్రికి నివాళులు అర్పించి SKN ని, కుటుంబ సభ్యులని పరామర్శించారు. దీంతో SKN ఇంట్లో బన్నీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బన్నీ తన ఇంటికి రావడంపై SKN స్పందిస్తూ.. ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చి, నాకు ధైర్యం చెప్పినందుకు నా ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారి మృతికి ఆయన వచ్చి సానుభూతి మరియు సంతాపం తెలియ చేసినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.
Icon star @alluarjun visits the residence of producer @SKNonline, to offer moral support during challenging times. #AlluArjun #Pushpa2TheRule pic.twitter.com/k8YEsaGlvk
— Suresh PRO (@SureshPRO_) January 23, 2024